Corn Cultivation : మొక్కజొన్నలో చీడపీడల ఉధృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
Corn Cultivation : వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా , రబీలో నీటిపారుదల కింద సాగుచేస్తుంటారు రైతులు.

Corn Cultivation
Corn Cultivation : మొక్కజొన్న.. రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా చెప్పవచ్చు. వరి , పత్తి తరువాత తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన ఆహారధాన్యపు పంట కూడా ఇదే. తక్కువ పంట కాలంలో, దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంటను సాగుచేశారు. అయితే అక్కడక్కడ కాండం తొలుచు పురుగు, కత్తెరపురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం.
స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న.. రైతుల ఆదరణ పొందుతుంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా , రబీలో నీటిపారుదల కింద సాగుచేస్తుంటారు రైతులు . మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ళ దాణాలో ప్రధాన ముడి సరుకుగాను, చొప్పను పచ్చిమేత కోసం సాగుచేస్తారు. రబీ మొక్కజొన్నను నీటిపారుదల కింద అక్టోబరు మొదటివారం నుంచి నవంబర్ వరకు విత్తుకున్నారు రైతులు.
అయితే అక్కడక్కడ కాండం తొలుచు పురుగు, కత్తెరపురుగులతో పాటు ఎండుతెగులు ఎన్విరియా తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని తెలియజేస్తున్నారు, కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, డి. శ్రీనివాసరెడ్డి.
Read Also : Integrated Farming : సమీకృత వ్యవసాయంలో.. వరి, చేపలు, ఉద్యాన పంటల సాగు