Munaga Cultivation : ప్రత్యామ్నాయ పంటగా 8 ఎకరాల్లో మునగ సాగు.. 7 నెలలకే 16 లక్షల ఆదాయం

ఇందుకోసం మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటే పంటగురించి తెలుసుకొని.. స్థానిక రైతుల వద్ద.. కిలో 3 వేల చొప్పున 3 కిలోల విత్తనం కొనుగోలు చేసి, గత ఏడాది జూన్ లో 8 ఎకరాల్లో మునగ నాటారు. నాటిన 5 నెలలు అంటే నవంబర్ నుండి దిగుబడి ప్రారంభమైంది.

Munaga Cultivation : ప్రత్యామ్నాయ పంటగా 8 ఎకరాల్లో మునగ సాగు.. 7 నెలలకే 16 లక్షల ఆదాయం

Munaga Cultivation

Updated On : August 10, 2023 / 7:17 PM IST

Munaga Cultivation : పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ.. రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతున్నది. తిన్నవారికి ఆరోగ్యం, పండించిన వారికి లాభాలు అందిస్తున్నది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు అందిస్తూ.. అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. అందుకే సంప్రదాయ పంటలను వదిలి.. మునగసాగుచేపట్టారు సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు.. మరి దిగుబడి.. ఆదాయం ఎలా ఉందో ఆ రైతు అనుభవం తెలుసుకుందాం..

READ ALSO : Cow Attacks Girl : షాకింగ్.. రెచ్చిపోయిన ఆవు, చిన్నారిపై విచక్షణారహితంగా దాడి, కుమ్మి కుమ్మి పడేసింది.. ఒళ్లుగగుర్పొడిచ వీడియో

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మునగ తోటను చూడండీ.. మొత్తం 8 ఎకరాలు. సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు మండల ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రం రైతు రఘుపతి రెడ్డిది. తనకున్న 12 ఎకరాల్లో 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఎప్పుడు వరి, మిర్చి, పత్తి లాంటి సంప్రదాయ పంటలను సాగుచేసేవారు. అయితే పెరిగిన పెట్టుబడులకు తోడు.. దిగుబడులు తగ్గడం.. వచ్చిన దిగుబడులకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో పంట మార్పిడి చేయాలనుకున్నారు.

READ ALSO : Tomato Price: హమ్మయ్య.. భారీగా తగ్గిన టమాటా ధర

ఇందుకోసం మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటే పంటగురించి తెలుసుకొని.. స్థానిక రైతుల వద్ద.. కిలో 3 వేల చొప్పున 3 కిలోల విత్తనం కొనుగోలు చేసి, గత ఏడాది జూన్ లో 8 ఎకరాల్లో మునగ నాటారు. నాటిన 5 నెలలు అంటే నవంబర్ నుండి దిగుబడి ప్రారంభమైంది. వచ్చిన దిగుబడిని కరీంనగర్ లో అమ్ముతున్నారు. మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుండటంతో లాభాలు బాగానే ఉన్నాయంటున్నారు ఈ రైతు. అంతే కాదు ఈ రైతు పంట సాగును చూసి మరో రైతు కూడా మునగను సాగుచేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

మునగ తక్కువ ఖర్చుతో కూడిన పంట. ఒక్కసారి విత్తిన తర్వాత ఆరేడేళ్ల వరకు మళ్లీ పొలం దున్నాల్సిన పనిలేదు. అయితే ప్రతి జూన్ నెలలో కార్శీ చేస్తుండాలి. అంటే మొక్కతోటను నరికిన తర్వాత, ఆమోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా ఇంకో పంటను తీసుకోవడం. ఇలా 7 ఏళ్లలో ప్రతి సంవత్సరం 7 నెలలపాటు పంట దిగుబడిని తీసుకోవచ్చు.

READ ALSO : Gaya Pind daan : గయలో పిండ ప్రదానం ఎందుకు చేస్తారంటే?

రైతు తనకున్న 8 ఎకరాల్లో నెలకు మూడు కోతల చొప్పున.. కోసిన ప్రతి సారి 50 క్వింటాళ్ల మునగ దిగుబడిని తీస్తున్నారు. అంటే 7 నెలలకు 21 సార్లు కోతలు కోస్తున్నారు. సరాసరి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా… 840 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. మార్కెట్ లో ప్రస్తుతం కిలో ధర  40 రూపాయలు పలుకుతోంది. సరాసరి కిలో 20 రూపాయలు పలికినా 8 ఎకరాలకు 7 నెలల్లో 16 లక్షల 80 వేల ఆదాయం వస్తోంది. సంప్రదాయ పంటలతో పోల్చితే అధిక లాభాలు అంటున్నారు రైతు