Cultivation of Turmeric : విశాఖ ఏజెన్సీలో వర్షాధారంగా పసుపు సాగు

విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో సాగయ్యే పసుపుకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది.   సాధారణంగా ఈ ప్రాంతంలో సంప్రదాయ పసుపు దిగుబడి రెండేళ్లకు ఒకసారి వస్తుంది. ఎకరాకు 4 నుండి 5 టన్నుల పచ్చిపసుపు దిగుబడి వస్తుంది. ఎండు పసుపు 1200 నుండి 1400 కిలోల వరకు వస్తుంది.

Cultivation of Turmeric : విశాఖ ఏజెన్సీలో వర్షాధారంగా పసుపు సాగు

Cultivation of Turmeric

Updated On : June 13, 2023 / 12:46 PM IST

Cultivation of Turmeric : పసుపు పంట విస్తీర్ణంలో, ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు దేశంలో ప్రధమ స్థానంలో ఉన్నాయి. దాదాపు 72 వేల హెక్టార్లలో సాగుచేయబడుతూ, నాలుగున్నర లక్షల టన్నుల  దిగుబడితో తెలుగు రైతులకు సౌభాగ్యాన్నిస్తోంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో పసుపు ఒక ప్రధాన పంటగా పేర్కొనవచ్చు. ఈ ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్ కు అనుగుణంగా పసుపు నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే అధిక దిగుబడికోసం రకాల ఎంపిక, యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఉద్యాన శాస్త్రవేత్త డా. వెంటక సుబ్బారెడ్డి.

READ ALSO : Cultivation Of Turmeric : హైడ్రోఫోనిక్ విధానంలో.. బస్తాల్లో పసుపు సాగు

పసుపు దుంపజాతి ఉష్ణమండలపు పంట.  తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా వుంటుంది.  పసుపుసాగులో మనదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో వుండగా…దాదాపు 40శాతం సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో వుండటం గర్వకారణం. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషద,సుగంధ పరిశ్రమల్లోను, కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి ఇంత ప్రాధాన్యత వున్న పసుపుసాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు, శాస్త్రీయంగా సాగుచేయాల్సి ఉంటుంది.

READ ALSO : Turmeric Crop Cultivation : మేలైన పసుపు రకాలు.. సాగు యాజమాన్యం

అయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో సాగయ్యే పసుపుకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది.   సాధారణంగా ఈ ప్రాంతంలో సంప్రదాయ పసుపు దిగుబడి రెండేళ్లకు ఒకసారి వస్తుంది. ఎకరాకు 4 నుండి 5 టన్నుల పచ్చిపసుపు దిగుబడి వస్తుంది. ఎండు పసుపు 1200 నుండి 1400 కిలోల వరకు వస్తుంది. దీనినే దృష్టిలో ఉంచుకొని  తక్కువ కాలంలో అధిక దిగబడినిచ్చే రోమ, కస్తూరి, ప్రగతి రకాలను  గిరిజన రైతులకు అధికారులు ఇచ్చి సాగుచేయిస్తున్నారు.

READ ALSO : Intercrop In Papaya : బొప్పాయిలో అంతర పంటగా పసుపు సాగు

పసుపును మే నెల మూడో వారం నుంచి జూన్‌ రెండో వారం వరకు నాటుతుంటారు. అయితే ఇక్కడి రైతులు సరైన దిగుబడులను పొందలేకపోతున్నారు. అధిక దిగుబడి పొందాలంటే సాగులో  చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. వెంకట సుబ్బారెడ్డి. అధిక వర్షపాతం గల ఏజెన్సీ ప్రాంతాలలో సమతల మడుల పద్ధతి కంటే ఎత్తు మడుల పద్ధతి లేదా బోదె సాళ్ళ పద్ధతిలో నాటుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే ఏజెన్సీలోని రైతులు పసుపులో అంతరపంటగా జొన్న, మొక్కజొన్న వేస్తుంటారు. ఒక పంటకు వేసిన ఎరువులతో రెండు పంటలు తీయడం అనాదిగా వస్తున్న ఆచారం.