Custard Apple Cultivation : పొలం గట్లపై సీతాఫలం సాగు
Custard Apple Cultivation : పాడి పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలు.. పంట పొలాలకు.. పంట పొలాల వ్యర్థాలు పాడిపరిశ్రమకు వాడుతూ.. పెట్టుబడులు తగ్గించుకొని నాణ్యమైన దిగుబడులను పొందేవారు.

Custard Apple Cultivation On Field Ridges
Custard Apple Cultivation : రోజురోజుకు వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. దిగుబడులు తగ్గుతున్నాయి. వచ్చిన దిగుబడులకు మార్కెట్ లో సరైన ధరలు పలకడంవేలు. దీంతో ఆరుగాలం కష్టపడుతున్న అన్నాదాతకు అప్పులే మిగులుతున్నాయి. కాలనికి అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేపడితే.. నష్టాల సేద్యాన్ని లాభాల వైపు నడిపించవచ్చని పలువురు రైతులు నిరూపిస్తున్నారు . ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు వరిపంట పండిస్తూనే.. గట్లపై సీతాఫలం మొక్కలు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతున్నారు.
ఒకప్పుడు రైతులు సమీకృత వ్యవసాయం చేసేవారు. పాడి పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలు.. పంట పొలాలకు.. పంట పొలాల వ్యర్థాలు పాడిపరిశ్రమకు వాడుతూ.. పెట్టుబడులు తగ్గించుకొని నాణ్యమైన దిగుబడులను పొందేవారు. అంతే కాదు ఒకవేల పంట దెబ్బతిన్నా.. అనుబంధ రంగాల ద్వారా ఆ లోటును పూడ్చుకునేవారు.
అయితే, రాను రాను వాణిజ్య పంటలకు మార్కెట్ లో అధిక ధరలు పలకడం.. రైతులు వీటిసాగుకు మొగ్గుచూపారు. అంతే కాదు అనుబంధ రంగాలను వదిలేసి ఏకపంట విధానాన్నే పాటించారు. అయితే, ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులతో ఒక్కో సారి పంటదెబ్బతిని పూర్తిగా నష్టాలను చవిచూసేవారు.
అంతే కాదు ఒక వేల పంట దిగుబడి వచ్చినా.. డబ్బులు ఆరు నెలలకోసారి మాత్రమే రైతులు చేతిలో ఉండేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు కొత్త ఆలోచనలకు తెరతీస్తున్నారు. అలా కొత్త ఆలోచనలు చేసిన రైతుల్లో ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలం, వెల్లమిల్లి గ్రామానికి చెంది రైతు పరిమి సత్యనారాయణ ఒకరు. తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో వరిని సాగుచేస్తూనే.. అంతర పంటలుగా పలు పండ్ల మొక్కలు నాటారు. బాడర్ క్రాప్ గా సీతాఫలం మొక్కలు నాటి వాటి ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు