Dragon Fruit Cultivation : అల్ట్రా హైడెన్సిటీ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు – మూడేళ్లకే పెట్టుబడి చేతికి అంటున్న రైతు
Dragon Fruit Cultivation : ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మార్కెట్ లో యమ డిమాండ్ ఉండేది. కిలో 300 ల వరకు పలికేది. అందుకే రైతులు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగును చేపట్టారు.
Dragon Fruit Cultivation : తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన డ్రాగన్ ఫ్రూట్స్ తోటలే కనిపిస్తున్నాయి. పెట్టుబడి ఎక్కువే అయినా.. రైతులు ఎంతో కొంత విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. అయితే పెట్టుబడి చేతికి రావాలంటే కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది. ఈ నేపధ్యంలో కొందరు రైతులు మాత్రం రెండుమూడేళ్లలోనే పెట్టుబడిని తీసుకునేందుకు కొత్త కొత్త పద్ధతులను పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు ట్రెల్లీస్ విధానంలో ఎకరాకు 5 వేల మొక్కలను నాటి సాగుచేస్తూ.. మంచి దిగుబడిని తీస్తున్నారు.
ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మార్కెట్ లో యమ డిమాండ్ ఉండేది. కిలో 300 ల వరకు పలికేది. అందుకే రైతులు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగును చేపట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎకరంలోనో, అర ఎకరంలోనో డ్రాగన్ ఫ్రూట్ సాగు కనబడుతూనే ఉంది. అయితే దీనికి పెట్టుబడి ఎక్కువే అయినా.. దిగుబడి నాటిన 25 నుండి 30 ఏళ్ల వరకు వస్తుంది కాబట్టి రైతులు వీటి సాగుకు మొగ్గుచూపారు. దీంతో దిగుబడి పెరిగింది. మార్కెట్ లో పండ్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కిలో ధర రూ. 100 నుండి 150 వరకు పలుకుతుంది. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ సాగుచేయాలంటే ఎకరాకు 500 స్థంబాలు అవసరం. ఒక్కో స్థంబానికి 4 మొక్కలు చొప్పున, 2 వేల మొక్కలు పడుతాయి. అయితే అన్ని యాజమాన్య పద్ధతులు పాటించి సాగుచేస్తే.. 4 ఏళ్లలో పంట పెట్టుబడి చేతికి వస్తుంది.
అయితే, మార్కెట్ లో పెరిగిపోతున్న డ్రాగన్ ఫ్రూట్ దిగుబడిని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడిని త్వరగా చేజిక్కించుకునేందుకు ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలం, మాధవరం గ్రామానికి చెందిన రైతు వెంకటరెడ్డి… 2 ఎకరాల్లో ట్రెల్లీస్ విధానంలో అల్ట్రాహైడెన్సిటీ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తున్నారు. అల్ట్రా హెడెన్సిటీ అంటే ఎకరాకు 2 వేల మొక్కలు పెట్టిన చోట 4 వేల మొక్కలు నాటడం అన్నమాట. అంటే సాధారణ పద్ధతిలో ఎకరాకు మొదటి ఏడాది 2 టన్నుల దిగుబడి వస్తే.. ఈ విధానంలో 6 టన్నుల పండ్ల దిగుబడి వస్తుంది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రెండేళ్లోనే చేతికొస్తుంది. ఆతరువాత వచ్చేది మొత్తం నికర ఆదాయమే…
డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఒకసారి నాటితే 25, 30 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. అందుకే నేల తయారీ దగ్గరి నుంచి పోల్స్ ఏర్పాటు చేసుకునే వరకు నాణ్యతా ప్రమాణాలు పాటించారు. ఇక ఈ మొక్కలకు నీరు పెద్దగా అవసరం ఉండదు. నీటి సౌకర్యం తక్కువగా ఉండటంతో డ్రిప్ ఏర్పాటు చేసి నీటి తడులతో పాటు పోషకాలను అందిస్తున్నారు. వచ్చిన దిగుబడిని తోట వద్దే కొంత అమ్ముతూ.. మిగితా పండ్లను వ్యాపారులకు హోల్ సేల్ గా అమ్మకం చేపడుతున్నారు.
Read Also : Dragon Fruit Farming : ప్రకృతి విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు – అంతర పంటగా వక్కను సాగుచేస్తున్న ఏలూరు రైతు