Electric Mini Tractor : రైడ్ ఆన్ టూల్ బార్.. మినీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్.. కేవలం రూ. 10 ఖర్చుతో పొలంలో అన్ని పనులు చేస్తుంది!
Electric Mini Tractor : బ్యాటరీతో నడిచే ఒక చిన్న ట్రాక్టర్. మరి ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఎలా పనిచేస్తుంది? దాని వివరాలేంటి..? వ్యవసాయంలో ఎలాంటి పనులు చేస్తుంది అనే వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..

Driverless AI Powered Electric Mini Tractor For Farmers
Electric Mini Tractor : వ్యవసాయంలోకి యాంత్రీకరణ వచ్చాకా సాగు సులభమైంది. ఎడ్లు చేసే పనిని ట్రాక్టర్లు సులువుగా, వేగంగా చేస్తున్నాయి. పొలం దున్నడం మొదలు విత్తనాలు విత్తడం.. కలుపు తీయడం , పురుగు మందుల పిచికారి, పంటకోత ఇలా అన్ని పనులుకు ట్రాక్టర్ ను ఉపయోగిస్తున్నారు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
సాధారణంగా ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయాలంటే రూ. 5 లక్షలపైన ఖర్చవుతుంది. సన్న, చిన్నకారు రైతులు అంత భరించలేదు. పైగా పెరిగిన పెట్రోలు , డిజిల్ ధరలతో నిర్వాహణ కష్టతరంగా మారింది. ఇలాంటి వారికోసమే ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది బ్యాటరీతో నడిచే ఒక చిన్న ట్రాక్టర్. మరి దాని వివరాలేంటి..? వ్యవసాయంలో ఎలాంటి పనులు చేస్తుంది…? లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..
వినూత్న రీతిలో వ్యవసాయం.. యంత్రాలతోనే అన్ని పనులు :
వ్యవసాయంలో ప్రస్తుతం యాంత్రీకరణ పెరిగిపోయింది. సాగుకు కూలీలు దొరకకపోవడం.. కూలీ రేట్లు అధికమవడం …ఇతరత్రా కారణాలతో అన్నదాతలు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు దుక్కి దున్నాలన్నా, విత్తనాలు వేయాలన్నా, ఎరువులు చల్లాలన్నా, కలుపు తొలగించాలన్న ప్రతి పనిని రైతులు, కూలీలు చేసుకునేవారు. లేదా ఒకరికొకరు పరస్పరం అవగాహనతో పనులు కానిచ్చేవారు.
కానీ ప్రస్తుతం ట్రెండు మారింది. ప్రతి పనిని సమయం, డబ్బు వృథా చేయకుండా రైతులు వినూత్న రీతిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. దుక్కి దున్నటం మొదలు పంట చేతికొచ్చే వరకూ యంత్రాలతోనే చేస్తున్నారు. దీంతో ఎద్దులతో దున్నడం తగ్గిపోయింది.
బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మినీ ట్రాక్టర్ :
ఒకప్పుడు ఏ గ్రామంలో చూసినా రైతుల ఇంటి ముందు పాడి పశువులు, కాడెడ్లు, ఎడ్లబండ్లు, వ్యవసాయ సామగ్రి కనిపిస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం వాటి స్థానంలో ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు దర్శనమిస్తున్నాయి. చిన్న, సన్న కారు రైతులు కూడా యాంత్రీకరణ వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే, పెద్ద పెద్ద రైతులు కొనుగోలు చేసి.. తమ అవసరాలను తీర్చుకొని.. మిగితా సమయంలో బాడుగులకు తిప్పుతున్నారు. అదే చిన్న, సన్నకారు రైతులు అంత మొత్తం చెల్లించి కొనుగోలు చేయలేని పరిస్థితి. కొన్నా.. వీటి నిర్వాహణ కష్టంగా మారింది. ఈ నేపధ్యంలోనే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మినీ ట్రాక్టర్ ను రూపొందించింది ఇవాన్ ఆగ్రో సంస్థ.
వ్యవసాయంలో సమయానికి కూలీలు దొరకకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో.. సమయానికి కావాల్సిన సేద్యపు పనులు పూర్తి కావడం లేదు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రూపొందించిన రైడ్ ఆన్ టూల్ బార్ కు ఇవాన్ జేబు పేరు పెట్టారు. ఈ ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ విత్తనాలు విత్తడం, కలుపు తీయడం, కషాయాలు – ద్రావణాలు పిచికారీ చేసేందుకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కూరగాయలు, పండ్లను దగ్గరలోని మార్కెట్ కి తరలించేందుకు తోడ్పడుతుందంటున్నారు.
Read Also : Silkworm Cultivation : రెండెకరాల్లో పట్టుపురుగుల పెంపకం – నెలకు రూ. లక్ష నికర ఆదాయం పొందుతున్న రైతు