Silk Cultivation : పట్టుసాగులో.. ‘పట్టు’ పట్టిన రైతు బోజిరెడ్డి
Silk Cultivation : తక్కు వ పెట్టుబడితో ఎక్కవ లాభాలు వచ్చే అవకాశాలు పట్టుపురుగుల పెంపకంలో ఉన్నాయి. పట్టు సాగు వైపు అడుగులు వేస్తున్నారు.

Farmer Boji Reddy gets Successful in Silk Cultivation
Silk Cultivation : వ్యవసాయం అనగానే మనకు, పంట పొలాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ వ్యవసాయ రంగానిక అనుభంధంగా ఉన్న ఎన్నో రంగాల నుండి జీవనాధారం పొందవచ్చు. అటువంటి వాటిలో పట్టుపురుగుల పెంపకం ఒకటి. పట్టు పురుగులు పెంచుతున్న ఎంతో మంది రైతులు సంప్రదాయ పంటల్లాగా కాకుండా ప్రతినెలా నికర ఆదాయం పొందుతున్నారు. ఇలా పొందుతున్న వారిలో రంగారెడ్డి జిల్లా, గడ్డ మల్లయ్య గూడకు చెందిన రైతు బోజిరెడ్డి ఒకరు. ఇతర పంటలతో పోల్చితే ఈ పట్టుపురుగుల పెంపకం ఎలా ఉందో ఆయన అనుభవం ద్వారే తెలుసుకుందాం.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..
రైతులు ప్రధానంగా ఏడాదికి రెండు, మూడు పంటలు మాత్రమే పండిస్తుంటారు. నీటి వసతినిబట్టి ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లో పంటలు వేస్తారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు దెబ్బ తింటే ఆ ఏడాదంతా రైతులు అప్పుల్లో కూరుకపోయి నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. వాణిజ్య పంటలకు పెట్టుబడులు పెరిగిపోవడం, అందుకు అనుగుణంగా పంట దిగుబడులకు మార్కెట్లో ధర రాని పరిస్థితుల్లో రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
పట్టు పురుగుల పెంపకంలో నష్టపోయే అవకాశం లేదు. పట్టుపురుగుల పెంపకంలో కీలకమైన చాకీ పురుగుల పెంపకాన్ని మొదటి రెండు జ్వరాల వరకు పట్టు శాఖ పెంచి ఇస్తుండటంతో రైతుకు రిస్కు తగ్గిపోయింది. దీనివల్ల ప్రతి 25 రోజులకు ఒక పంట చొప్పున, ఏడాదికి 7 నుంచి 8 పంటలను రైతులు తీసేవీలు ఏర్పడింది . అందుకే రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, గడ్డ మల్లయ్య గూడకు చెందిన రైతు బోజిరెడ్డి రెండేళ్ళుగా పట్టుపురుగుల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
తక్కు వ పెట్టుబడితో ఎక్కవ లాభాలు వచ్చే అవకాశాలు పట్టుపురుగుల పెంపకంలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రైతులు పట్టు సాగు వైపు అడుగులు వేస్తున్నారు. అవసరమైన సలహాలు, సూచనలు, ప్రోత్సాహం అందిస్తూ, ఈ పరిశ్రమను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తే మరింత విస్తీర్ణంలో సాగుపెరిగి, రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు.
Read Also : Chilli Plantations : మిరప తోటల్లో వైరస్ తెగులు ఉధృతి – నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం