Crop Protection in Maize : మొక్కజొన్నలో ఎరువులు, సస్యరక్షణ

Crop Protection in Maize : వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది.

Crop Protection in Maize : మొక్కజొన్నలో ఎరువులు, సస్యరక్షణ

Fertilizers And Crop Protection in Maize

Updated On : January 28, 2024 / 4:23 PM IST

Crop Protection in Maize : రబీ మొక్కజొన్న పంట రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా మారింది. తక్కువ పంట కాలం.. దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మాగాణి భూముల్లో రబీ మొక్కజొన్న వేశారు రైతులు . అయితే ఈ పంటలో ఎరువులు, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం సమయానుకూలంగా చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చని తెలుపుతున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్.

Read Also : Rabi Sesame Cultivation : రబీ నువ్వు సాగు యాజమాన్యం.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు

మొక్కజొన్నలో సస్యరక్షణ :
వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక , దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది.  స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది. ఖరీఫ్ లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు వున్నప్పటికీ, రబీలో నీటిపారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తుంది.

రైతులు ఎకరాకు 40 నుంచి 50క్వింటాళ్ల దిగుబడిని నమోదుచేస్తున్నారు. మొక్కజొన్న భూమినుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట. రసాయన సేంద్రీయఎరువుల రూపంలో మనం అందించి పోషకాలకు త్వరగా స్పందిస్తుంది. అందువల్ల ఈ పంట సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువులు, సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి.

తెలుగు రాష్ట్రాలలో  వరి కోసిన తరువాత నేరుగా కాని , వరి తరువాత జీరో టిల్లేజ్ పద్ధతిలో కానీ లేదా సాధారణ పద్ధతిలో సాగుచేస్తూ ఉంటారు రైతులు . అయితే వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం మొక్కజొన్న మోకాలెత్తు దశలో ఉంది. అక్కడక్కడ కాండం తొలుచు పురుగు, కత్తెరపురుగులతో పాటు పొడతెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని తెలియజేస్తున్నారు.

Read Also : Pulses Cultivation : వేసవి అపరాల సాగులో మెళకువలు – అధిక దిగుబడులకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం