Poultry Farming : టర్కీకోళ్ళ పెంపకం చేపడితే.. అధిక లాభాలు

Poultry Farming : టర్కీకోళ్ళకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. రైతులు తమ ఫాం హౌజ్ ల వద్ద.. ఇంటి వద్ద, ఫ్యాషన్ గా కొద్ది మొత్తంలో పెంచుతున్నారు.

Poultry Farming : టర్కీకోళ్ళ పెంపకం చేపడితే.. అధిక లాభాలు

High Profits Earning With Turkey Poultry Farming

Updated On : January 17, 2025 / 2:36 PM IST

Poultry Farming : సాధారణంగా మాంసం కోసం బ్రాయిలర్ కోళ్ళు, నాటుకోళ్ళను పెంచుతుంటారు రైతులు. అయితే కొందరు అందంకోసం, ఫ్యాషన్ కోసం టర్కీ కోళ్ళను పెంచుతుంటారు. వీటిని కోళ్ళ మాదిరిగానే షెడ్ లను ఏర్పాటు చేసి ఫ్రీరేంజ్ పద్ధతిలో తోటల్లో , పెరట్లో పెంచుతుంటారు. మాంసంకోసం గుడ్ల కోసం 18 నుండి 20 వారాల వరకు పెంచే ఈ టర్కీకోళ్ళ పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు పివి నర్సింహరావు వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ డా. దైద కృష్ణ ప్రసాద్.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

పెరుగుతున్న నిరుద్యోగులకు అవసరమయిన ఉపాధి అవకాశాలు వ్యవసాయం  దాని అనుబంధ రంగాలలోనే అధికంగా ఉందని చెప్పవచ్చు. మన దేశంలో జనాభాతో పాటు నిరుద్యోగుల సంఖ్య కూడా ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. కొత్తగా స్థాపించే పరిశ్రమలు కాని, సేవా రంగాలు కాని, ప్రభుత్వ ఉపాధి అవకాశాలు గాని నిరుద్యోగులందరికి ఉద్యోగ అవకాశాలు చూపించలేకపోతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.

అందుకే చదువుకున్న యువత ఇప్పుడు వ్యవసాయం , దాని అనుబంధరంగాలవైపు అడుగులు వేస్తున్నారు. కాని కొంతమంది అవగాహన లేకుండా ఎక్కువ పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. అలా నష్టపోయిన వారిని చూసి కొంతమంది వెనుకంజవేస్తున్నారు. కాని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తక్కువ పెట్టుబడితో ఉపాధి అవకాశాలను మొదలుపెట్టి, పలు జాగ్రత్తలు పాటించినట్లయితే తప్పని సరిగా ఫలితం పొందవచ్చు.  అలా తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టగలిగే లాభదాయకమయిన వ్యవసాయ అనుబంధ రంగాలలో కోళ్ళు, క్వాయిల్ పక్షుల పెంపకం ముందు వరుసలో ఉండగా.. తరువాత స్థానం టర్కీకోళ్ళదని  చెప్పవచ్చు.

ఇటీవల టర్కీకోళ్ళకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. రైతులు తమ ఫాం హౌజ్ ల వద్ద.. ఇంటి వద్ద, ఫ్యాషన్ గా కొద్ది మొత్తంలో పెంచుతున్నారు. అయితే కొద్దిపాటి యాజమాన్య పద్ధతుల పాటించి.. మార్కెట్ చేసుకోగలిగితే మంచి లాభాలను పొందడానికి అవకాశం ఉందంటూ.. టర్కీకోళ్ళ పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు పివి నర్సింహరావు వెటర్నరీ కాలేజ్ పౌల్ట్రీసైన్స్ డిపార్ట్ మెంట్,  ప్రొఫెసర్ అండ్ హెడ్ డా. దైద కృష్ణ ప్రసాద్.

Read Also : Trichoderma Viride : ట్రైకోడెర్మా విరిడి తయారీతో.. తెగుళ్ళకు చెక్