Oil Palm Cultivation : 20 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు.. లాభాలకు ఢోకా లేందంటున్న రైతు
Oil Palm Cultivation : ఆయిల్ ఫాం ప్రపంచంలో కెల్లా అత్యధిక వంట నూనె దిగుబడిని ఇచ్చే పంట. ఈ పంటకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో ఏ ఏటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది.

high profits with oil palm techniques in telugu
Oil Palm Cultivation : తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో నాణ్యమైన పంట దిగుబడి పొందే పంట ఆయిల్ పామ్ . నాటిన 4 వ సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు ఈ తోటల నుండి ఆదాయం పొందే వీలుండటమే కాకుండా మధ్య దళారుల బెడద లేకపోవడంతో స్థిరమైన ఆదాయన్ని అందించే పంటగా ఆయిల్ పామ్ గుర్తింపు పొందింది. దీంతో తెలంగాణలో ఈ పంటసాగు విస్తీర్ణం పెరుగుతోంది . ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఈ పంటకు అనుకూలంగా ఉండటంతో… ఇక్కడి రైతులు ఈ పంట సాగుకు మొగ్గుచూపుతున్నారు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
ఆయిల్ ఫాం ప్రపంచంలో కెల్లా అత్యధిక వంట నూనె దిగుబడిని ఇచ్చే పంట. ఈ పంటకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో ఏ ఏటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ముఖ్యంగా ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వస్తుండటంతో.. చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఉద్యానశాఖ కూడా సబ్సిడీలు అందిస్తుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది రైతులు ఆయిల్ ఫాం సాగును చేపట్టారు.
నాటిన మొదటి మూడు ఏళ్ళపాటు అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉండటంతో.. ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం, బరంపూర్ గ్రామానికి చెందిన రైతు కేదారీశ్వర్ రెడ్డి గత ఏడాది 20 ఎకరాల్లో పామాయిల్ మొక్కలను నాటారు. ఖరీఫ్ లో అంతర పంటలుగా పత్తి, కంది సాగుచేస్తున్నారు. ఇతర పంటలతో పోల్చితే మంచి లాభాలను పొందే పంట ఆయిల్ ఫాం అని చెబుతున్నారు.
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యాన అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సాగుతో కలిగే లాభాలను రైతులకు తెలియజేస్తున్నాం. అంతే కాదు రైతులకు మొక్కలతో పాటు డ్రిప్, ఇతర పరికరాలను రాయితీపై ఇస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు ఆయిల్ ఫాం సాగు చేయడానికి ముందుకొస్తున్నారు.
ఆయిల్ పాం మొక్కలు నాటిన నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమవుతుంది. మొదట్లో ఎకరాకు 3 నుంచి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఏడేళ్ల తర్వాత ఎకరాకు 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి రానుంది. వచ్చిన దిగుబడిని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు. మరోవైపు ఆయిల్ పామ్ తోటలో మొక్కల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తోటలో అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..