New Rice Varieties : అధిక దిగుబడినిస్తున్న.. నూతన వరి రకాలు

వ్యవసాయ పరిశోధనా స్థానాలు రూపొందించిన రకాలను మినికిట్ దశలోనే తీసుకొచ్చి తన పొలంలో అభివృద్ధి పర్చి విత్తనంగా అమ్ముతుంటారు. ఈ రబీలో 9 ఎకరాల్లో జగిత్యాల వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన జె.జి.ఎల్ - 27356 ( ఇరువై ఏడు మూడువందల యాభైఆరు) సాగు చేపట్టారు.

New Rice Varieties : అధిక దిగుబడినిస్తున్న.. నూతన వరి రకాలు

New Rice Varieties

Updated On : April 18, 2023 / 11:36 PM IST

New Rice Varieties : బిన్నమైన ఆలోచనలు ఉన్నవారు వైవిధ్యమైన పంటలను పండిస్తుంటారు. వాటికి మార్కెట్ లో మంచి ధర వచ్చి లాభాలను గడించే అవకాశం ఉంటుంది.  చాలామంది రైతులు సాధారణంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నలు సాగు చేస్తుంటారు. కొత్త కొత్త రకాలను సాగు చేయాలని ఆసక్తి ఉన్నా, దిగుబడి, డిమాండ్, మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన లేకపోవడంతో విరమించుకుంటున్నారు. కానీ కొందరు రైతులు మాత్రం నూతన వంగడాలను పండిస్తూ.. సాగులో వైవిధ్యం చూపిస్తున్నారు.

READ ALSO : Pests in Rice : వరిపంటకు తీవ్రనష్టం కలిగిస్తున్న తెగుళ్లు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఈ కోవలోనే నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు కొన్నేళ్లుగా నూతన వరి రకాలు సాగుచేస్తూ.. వాటిని విత్తనంగా అమ్మి, మంచి లాభాలను పొందుతున్నారు. నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం, వల్లభాపురం గ్రామానికి చెందిన రైతు ఒంటెద్దు వెంకట్ రెడ్డి తనకున్న వ్యవసాయ పొలంలో కొన్నేళ్లుగా నూతన వరి వంగడాలను సాగుచేస్తున్నారు.

వ్యవసాయ పరిశోధనా స్థానాలు రూపొందించిన రకాలను మినికిట్ దశలోనే తీసుకొచ్చి తన పొలంలో అభివృద్ధి పర్చి విత్తనంగా అమ్ముతుంటారు. ఈ రబీలో 9 ఎకరాల్లో జగిత్యాల వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన జె.జి.ఎల్ – 27356 ( ఇరువై ఏడు మూడువందల యాభైఆరు) సాగు చేపట్టారు.

READ ALSO : Paddy Cultivation : వరిలో కాండంతొలుచు పురుగు, సుడిదోమ ఉధృతి… నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

అలాగే  రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన ఆర్.ఎన్.ఆర్ – 31479 (ముప్పైఒకటి నాలుగు వందల డెబ్బైతోమ్మిది), 15048 (పదిహేను సున్నా నలభైఎనిమిది )తో పాటు నాగపూర్ నుండి తీసుకొచ్చిన నాగపూరు చింట్లు రకాలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం గింజపాలుపోసుకునే దశలో ఉన్నాయి. చీడపీడలను సమర్థవంతంగా తట్టుకొని , ఎకరాకు 45 నుండి 50 బస్తాల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.