Tomato Cultivation : టమాటా సాగుతో భారీ లాభాలు…ఆరునెలల్లో 30లక్షల అదాయం
రాజేందర్ రెడ్డి సాగుచేసిన టమాట పంట అధిక దిగుబడి వచ్చింది. దీనికి తోడు మంచి నాణ్యత కూడా ఉండటంతో వ్యాపారులే తోటకు వచ్చే నేరుగా కొనుగోలు చేయటం ప్రారంభించారు. పశ్చిమ బంగ రాష్ట్రానికి స
Tomato Cultivation : అత్యాధునిక సేధ్యపు పద్దతులు, శాస్త్రవేత్తల సూచనలు ప్రస్తుతం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణాలోని కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ఓ రైతు సాధించిన ఘనత ప్రస్తుతం యావత్ రైతాంగానికి ఆదర్శవంతంగా మారింది. వ్యవసాయంలో అద్భుతాలు చేయటం ద్వారా లక్షల రూపాయల అదాయం పొందవచ్చని మరోసారి నిరూపితమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కల్వకుర్తి మండలం ముకురాల గ్రామానికి చెందిన రైతు రాజేందర్ రెడ్డికి 10 ఎకరాల పంట భూమి ఉంది. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు అందులో 3లక్షల ఖర్చు చేసి శాశ్వితమైన పందిరి వేశాడు. ఈ పందిరి క్రింద టమాట పంట సాగుచేయాలని నిర్ణయించుకున్నాడు. వేసవిని తట్టుకునే టమాట రకం నారు కొనుగోలు చేశాడు. ఎలాంటి రసాయన ఎరువులు వినియోగించకుండా వేపనూనె, వేస్ట్ డీ కంపోజర్ వంటి సేంధ్రీయ ఎరువులను మాత్రమే వినియోగిస్తూ టమాటా సాగు చేపట్టాడు. కూలీలకు గాను 2లక్షల రూపాయలను ఖర్చు చేశాడు.
రాజేందర్ రెడ్డి సాగుచేసిన టమాట పంట అధిక దిగుబడి వచ్చింది. దీనికి తోడు మంచి నాణ్యత కూడా ఉండటంతో వ్యాపారులే తోటకు వచ్చే నేరుగా కొనుగోలు చేయటం ప్రారంభించారు. పశ్చిమ బంగ రాష్ట్రానికి సైతం ఇక్కడి నుండి టమాటాను ఎగుమతి చేశారు. అయితే సుదుర ప్రాంతానికి రవాణా చేసినా పంట దెబ్బతినకుండా ఉండటం విశేషంగా చెప్పవచ్చు.
75రోజులకు టమాటా పంట కోతకు రాగా, ఒక్కో మొక్క నుండి 7కిలోల అత్యధిక దిగుబడి రావటం అందరిని ఆశ్ఛర్యపోయేలా చేసింది. ఇప్పటి వరకు ఆరు ఎకరాల్లో 16వేల బాక్సుల పంట ఉత్పత్తి అయ్యింది. మార్చి వరకు పంట వచ్చే అవకాశం ఉంది. ఒక్కో బాక్సును 500 రూపాయల వరకు గరిష్ట ధరకు రాజేందర్ రెడ్డి విక్రయించగలిగారు.
రాజేందర్ రెడ్డి టమాటా సాగుకోసం చేసిన ఖర్చుల వివరాలను పరిశీలిస్తే 8లక్షల రూపాయలను ప్రారంభపెట్టుబడిగా రాజేందర్ రెడ్డి ఖర్చు చేశారు. అనంతరం కూలీలు, ఇతర నిర్వాహణ ఖర్చులకు గాను 22లక్షలు ఖర్చయ్యాయి. ఇక అదాయం విషయానికి వస్తే 16వేల బాక్సుల పంట ఇప్పటి వరకు చేతికి వచ్చింది. సగటు బాక్సు ధర సుమారుగా 350 రూపాయలు వేసుకున్నా 56 లక్షల రూపాయల అదాయం అతని చేతికి వచ్చింది. ఖర్చులు తీసి వేస్తే 30లక్షలు లాభం పొందగలిగాడు.
గతంలో ఉల్లితోపాటు పలు పంటలను సాగు చేసి రాజేందర్ రెడ్డి తీవ్రంగా నష్టపోయాడు. తనకు మంచి సూచనలు అందించిన పాలెంలోని కృషి విజ్ణాన కేంద్రం శాస్త్రవేత్తలకు కృతజ్ణతలు తెలిపాడు. మంచి విత్తనాన్ని ఎన్నుకుంటే రైతులకు మంచి దిగుబడితోపాటు, అదాయం వస్తుందని రాజేందర్ రెడ్డి సహరైతులకు సూచిస్తున్నాడు.