Kandi Intercropping : కందిలో అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం

Kandi Intercropping : అపరాల పంటలను యాంత్రికరణ ద్వారా విత్తుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలియజేస్తున్నారు.

Kandi Intercropping : కందిలో అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం

With Intercropping in Kandi With Intercropping in Kandi

Updated On : May 11, 2024 / 3:17 PM IST

Kandi Intercropping : ఖరీఫ్‌కంది సాగు చేసే రైతులు.. అంతర పంటగా అపరాలను సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్తవేత్తులు. అయితే కూలీల సమస్య ఉన్న నేపథ్యంలో యాంత్రికరణతో విత్తుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా విత్తనం వృదా కాకుండా, మొక్కల మధ్య దూరం సమానంగా పెరుగుతోంది. దీంతో పంట ఆరోగయంగా పెరిగి అధిక దిగుబడులను సాధించవచ్చని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత.

ఖరీఫ్‌లో వరి, పత్తి తోపాటు అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట కంది. అయితే రైతులు చాలా వరకు కందిని ఏకపంటగా సాగుచేస్తూ ఉంటారు. అయితే, వాతావరణ మార్పులు , కారణంగా చీడపీడల వ్యాపించి పంట నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి, అంతర పంటలను సాగుచేస్తే , ఒక పంట నష్టపోయినా మరోపంటతో ఆనష్టాన్ని పూడ్చుకోవచ్చని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత . అంతే కాదు అపరాల పంటలను యాంత్రికరణ ద్వారా విత్తుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలియజేస్తున్నారు.

Read Also : Redgram Kharif : ఖరీఫ్‪లో వేసుకోదగిన కంది రకాలు.. జూలై 15 వరకు విత్తుకునే అవకాశం