Kharif Paddy Cultivation : ఖరీఫ్ వరిసాగులో మేలైన యాజమాన్యం

Kharif Paddy Cultivation : తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది.

Kharif Paddy Cultivation : ఖరీఫ్ వరిసాగులో మేలైన యాజమాన్యం

Kharif Paddy Cultivation

Updated On : July 30, 2024 / 12:23 AM IST

Kharif Paddy Cultivation : ఖరీఫ్ వరిసాగులో రైతులు బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలాచోట్ల నారుమడులు పోసుకోగా.. సాగునీరు ఆలస్యమైన ప్రాంతాల్లో కొంత మంది పోస్తున్నారు. అయితే ప్రధాన పొలంలో వరినాట్లు వేసేటప్పుడు… మేలైన జాగ్రత్తలు తీసుకుంటేనే పంట ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని రైతులుకు వరిసాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోదనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీలత.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది. ప్రస్థుతం దీర్ఘకాలి వరి రకాలు నాటుకునేందుకు సిద్ధమవుతుండగా.. సాగునీరు ఆలస్యమైన ప్రాంతాల్లో మధ్య, స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకుంటున్నారు రైతులు. అయితే ప్రధాన పొలంలో పచ్చిరొట్టను సాగుచేసిన రైతులు చేపట్టాల్సిన యాజమాన్యం.. నాటుకు ముందు నారుమడిలో ఎలాంటి యాజమాన్యం…  చేపట్టాలో రైతులకు వివరాలను తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీలత.

వాయిస్ ఓవర్ : నారును ప్రధాన పొలంలో విత్తే ముందే మేలైన యాజమాన్య పద్ధతులను పాలించాలి. ముఖ్యంగా వరిలో చీడపీడల వ్యాప్తితో పాటు కలుపు కూడా అధికంగా ఉంటుంది.  రైతులు సకాలంలో కలుపును నివారించకపోతే పంట దిగుబడితో పాటు కూలీల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. కొంత మంది రైతులు కలుపు నివారణకు , యూరియాలో కలుపు మందులను కలిపి చల్లుతుంటారు. అలా చేస్తే కలుపు మరింత పెరగడంతో పాటు పంట నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ కలుపును.. ఏవిధంగా అరికట్టాలో ఇప్పుడు చూద్దాం..

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు