Bottle Gourd Farming : సొరసాగుతో లక్షల్లో ఆదాయం పొందుతున్న రైతు

సొర పంటకు ఆశించే చీడపీడలను తక్కువ ఖర్చుతోనే నిర్మూలించవచ్చు . అయితే పంట ఎదుగుదల, పూత, కాత సమయంలో సమయానుకూలంగా ఎరువులు, నీటితడులు అందించాల్సి ఉంటుంది. దీన్నే తూచాతప్పకుండా పాటించారు రైతు.

Bottle Gourd Farming : సొరసాగుతో లక్షల్లో ఆదాయం పొందుతున్న రైతు

Bottle Gourd Farming

Updated On : November 13, 2023 / 4:27 PM IST

Bottle Gourd Farming : పంటల సాగుకు అదును, పదును అవసరం. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతు ఇవేమీ పట్టించుకోలేదు. ప్రతికూల పరిస్థితుల్లో సొరకాయ పంటను వేసి లాభాలు పండింస్తున్నారు. అధునాతన పద్ధతులతో పాటు, మార్కెట్ సరళిపై అవగాహన ఉంటే ఫలితం దానంతట అదే దక్కుతుందని నిరూపించారు. వచ్చిన దిగుబడులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తూ.. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాడు.

READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

సాధారణంగా సొరను ఖరీఫ్ లో జూన్ నుండి జులై చివరి వరకు, అదే రబీలో అయితే జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తుతుంటారు. అయితే కూరగాయలు పండించే రైతులు అధికంగా ఈ సమయాల్లోనే సాగుచేస్తుండటంతో.. పంట దిగుబడులు ఒకే సారి రావడం.. మార్కెట్ లో ధరలు పడిపోతున్నాయి. దీంతో రైతు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ  విషయాన్ని గమనించిన నెల్లూరు జిల్లా , సంగం మండలం, ఉడ్ హౌస్ పేటకు చెందిన రైతు భూపతి రాంప్రసాద్.. వాటిని ఏవిధంగా అధిగమించాలో ప్రణాళికలను వేసుకొని సాగుచేస్తున్నారు.

READ ALSO : Soybean Cultivation : సోయాబీన్ సాగులో చీడపీడలు సస్యరక్షణ చర్యలు!

సొరలో మొలక శాతం తక్కువ. అందుకే రైతు రాంప్రసాద్ ప్రోట్రేలలో నారు పెంచి ఆగస్టులో తనకున్న 4 ఎకరాల్లో మల్చింగ్ , డ్రిప్ విదానంలో నాటారు. అయితే సొర పంటను నేలపై పాకిస్తే చీడపీడల బెడద అధికంగా ఉంటుంది. అంతే కాదు కాయల నాణ్యత దెబ్బతింటుంది. వీటిని అధిగమించాలంటే పందిరి విధానంలో సాగుచేయాలి. అంటే శాశ్వత పందిరి అనేది అధిక ఖర్చుతో కూడుకున్నపని. కానీ రైతు తక్కువ ఖర్చుతో స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి, గూడు పందిరి విధానంలో తీగను పాకించారు. నాటిన 50 వ రోజునుండే దిగుబడి ప్రారంభమైంది.

READ ALSO : Boost Immunity : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే కూరగాయలు

సొర పంటకు ఆశించే చీడపీడలను తక్కువ ఖర్చుతోనే నిర్మూలించవచ్చు . అయితే పంట ఎదుగుదల, పూత, కాత సమయంలో సమయానుకూలంగా ఎరువులు, నీటితడులు అందించాల్సి ఉంటుంది. దీన్నే తూచాతప్పకుండా పాటించారు రైతు. సాదారణంగా మార్కెట్ లో  మనకు కనిపించే సొర కిలో, రెండు కిలోల బరువు వరకు ఉంటాయి. కానీ ఈ రైతు పొలంలో పండే ప్రతి కాయ అరకిలో బరువే ఉంటుంది. ఆకాయకే చెన్నై మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ. అందుకే తన తోటలో అరకిలోకు మించి బరువు కాయనీయకుండా కోస్తూ.. ఎగుమతి చేస్తున్నారు.

READ ALSO : Rabi Corps : రబీలో వేయదగిన పంటలు.. శాస్త్ర వేత్తల సూచనలు

సొర నాటిన 50 రోజుల నుండి దిగుబడి ప్రారంభమై.. రెండు నెలల వరకు కోత వస్తుంది. అయితే పందిరి విధానంలో సాగుచేసి, ఎరువులు, నీటి తడులు సమయానుకూలంగా అందిస్తే.. పంట దిగుబడులు మరికొద్ది రోజులు పెరిగే అవకాశం ఉంది. రైతు రాంప్రసాద్ దీన్నే పాటిస్తున్నారు. ఎకరాకు 30 టన్నుల వరకు దిగుబడి తీస్తున్న రైతు, ఖర్చులన్నీ పోను 3 నెల్లోనే రూ. 4 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు. మూసదోరణిలో పంటలు పండించే రైతులు ఈ రైతును ఆదర్శంగా తీసుకొని పంటల సాగుచేస్తే.. నష్టాల అనేవి ధరికి చేరవు.