Mango Orchards : మామిడి పూత దశలో ఈ పొరపాట్లు అసలు చేయొద్దు.. అధిక దిగుబడులు పొందాలంటే?

Mango Orchards : ఈ పురుగులు ఆశించినప్పుడు పూత పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది. ఈ సమయంలో మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తున్నారు

Mango Orchards : మామిడి పూత దశలో ఈ పొరపాట్లు అసలు చేయొద్దు.. అధిక దిగుబడులు పొందాలంటే?

Management in Mango Orchards

Updated On : February 13, 2025 / 2:26 PM IST

Mango Orchards : ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడితోటల్లో పూత, పిందె ప్రారంభమైంది.  మరికొన్నితోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సివుంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు పూత, పిందె సమయంలో పాటంచే యాజమాన్యం ఒకఎత్తు.

Read Also : Home Agriculture : నగరాల్లో విస్తరిస్తున్న మిద్దెతోటలు – తక్కువ ఖర్చుతో ఇంటిపైనే కూరగాయల సాగు చేస్తున్న కుటుంబం

ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు, ఆశించకుండా  రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.  అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు  శాస్త్రవేత్త, జి. చిట్టిబాబు .

పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే.  తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల  హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో వున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు  అనుకూలంగా వుండటంతో సకాలంలో పూత ప్రారంభమవటంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది.

అయితే, మామిడి పూత దశలో ఆశించే పురుగుల్లో తేనే మంచు పురుగులను ప్రత్యేకంగా చెప్పవచ్చు. వీటి వల్ల నష్టం ఎక్కువగా నవంబర్ నెల నుండి మార్చి నెల ఆఖరు వరకు ఉంటుంది. ఈ పురుగులు ఆశించినప్పుడు పూత పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది. ఈ సమయంలో మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తున్నారు శాస్త్రవేత్త, జి. చిట్టిబాబు.

మామిడి కాయలను పక్వానికి వచ్చిన తర్వాత ఆలస్యంగా కోత కోసినట్లయితే పండుఈగ ఆశించి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఈ పురుగు యొక్క తల్లి ఈగలు ఎరుపు, గోధుమ రంగులో కలిగి శరీరంతో పసుపు పచ్చని చారలు కలిగి ఉండి, ఒకే జత రెక్కలతో  తోటలలో ఆకుల అడుగు భాగంలో ఎగురుతూ ఉంటాయి.

Read Also : Chicken Farming : మేలుజాతి కోళ్లతో స్వయం ఉపాధి.. ఇంటి దగ్గరే ఉంటూ.. నెలకు రూ. 60 వేలు సంపాదిస్తున్న కోదాడ వాసి!

ఈ పండు ఈగ పిల్ల పురుగులు గుజ్జును తిని పండ్లను కుళ్లిపోయి రాలిపోయేలా చేస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల కాయలు తినటానికి గాని, గుజ్జు తీయడానికి గాని పనికిరాక ఎగుమతులకు కూడా ఉపయోగపడకుండాపోతాయి. మామిడి పూత దశలో శాస్త్రవేత్తల సూచనలు పాటించి, సరైన నీటియాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపడితే మండి దిగుబడులను తీయవచ్చు.