Chicken Farming : మేలుజాతి కోళ్లతో స్వయం ఉపాధి.. ఇంటి దగ్గరే ఉంటూ.. నెలకు రూ. 60 వేలు సంపాదిస్తున్న కోదాడ వాసి!

Chicken Farming : సూర్యపేట జిల్లాకు చెందిన పూర్ణచందర్ రావు మేలుజాతి కోళ్లను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంటి దగ్గరే ఉంటూ.. ప్రతి నెల రూ. 60 వేలు సంపాదిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Chicken Farming : మేలుజాతి కోళ్లతో స్వయం ఉపాధి.. ఇంటి దగ్గరే ఉంటూ.. నెలకు రూ. 60 వేలు సంపాదిస్తున్న కోదాడ వాసి!

Country Chicken Farming

Updated On : February 13, 2025 / 2:20 PM IST

Chicken Farming : ఒకప్పుడు గ్రామాల్లో రైతులు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న నాటు కోళ్ల పెంపకం నేడు ఉపాధిగా మారుతోంది. లాభసాటిగా మారిన ఈ పరిశ్రమ వైపు యువ రైతులు, నిరుద్యోగుల దృష్టి మరలుతోంది. ఇదే రీతిలో సూర్యపేట జిల్లాకు చెందిన పూర్ణచందర్ రావు మేలుజాతి కోళ్ల ను  పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంటి దగ్గరే ఉంటూ.. ప్రతి నెల రూ. 60 వేలు సంపాధిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

వ్యవసాయం, పాడి తరువాత స్థానం కోళ్ల పెంపకానిది. గ్రామీణుల ఆదాయాన్ని పెంచే విషయాల్లో మొదట చెప్పుకునేది నాటు కోళ్ల పెంపకమే. జాతి కోళ్ల పెంపకం ద్వారా మంచి ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చు. అయితే ఇప్పుడు ఆ తీరు పూర్తిగా మారింది. కొందరు రైతులు, యువకులు ప్రత్యేకంగా షెడ్లలో వీటిని పెంచుతున్నారు.

రుచిలో ప్రత్యేకత ఉండటం, రోగ నిరోధకశక్తికి మేలు జరగడం, పోషణపరంగా సులభతరమైన విధానాలుండటం వల్ల వీటి పెంపకానికి మొగ్గు చూపుతున్నారు. ఆశించిన రీతిలో ఆదాయం వస్తుండటంతో అదే వృత్తిగా ఎంచుకొని ఉపాధిగా మార్చుకుంటున్నారు. ఈ కోవలోనే సూర్యపేట జిల్లా, కోదాడ మండలం, కూచిపూడి గ్రామానికి చెందిన శెట్టి పూర్ణచందర్ రావు మేలుజాతి నాటుకోళ్ల పెంపకం చేపడుతూ.. నికరమైన ఆదాయం పొందుతున్నారు.

ఇదిగో ఇక్కడ చూడండీ.. ఈ వ్యవసాయ క్షేత్రం. మొత్తం 2 ఎకరాలు. వృదాగా ఉన్న ఈ వ్యవసాయ భూమిలో రెండేళ్ల క్రితం మేలుజాతి నాటు కోళ్ల పెంపకం చేపట్టారు పూర్ణచందర్ రావు. ఇందుకోసం రెండు షెడ్ లను ఏర్పాటు చేసుకున్నారు.  30 కోళ్లతో ప్రారంభించిన ఫాం  ప్రస్తుతం 200 కోళ్లు. ఉన్నాయి. అందులో పర్లా, పేరు, శీలం పర్లా, రిచ్ వాటం లాంటి అనేక మేలు జాతి రకాలు ఉన్నాయి. అయితే వీటిని బ్రీడింగ్ చేయించి కోడిపిల్లలు.. గుడ్లు అమ్మకం చేపడుతున్నారు.

Read Also : Home Agriculture : నగరాల్లో విస్తరిస్తున్న మిద్దెతోటలు – తక్కువ ఖర్చుతో ఇంటిపైనే కూరగాయల సాగు చేస్తున్న కుటుంబం

నాటు కోడి మాంసం రుచి చూసిన వారు వదలరు. నాటు కోడి గుడ్లు, మాంసం బలవర్ధకమైనది. కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం వ్యాపార దిశగా సాగుతోంది. అయితే ఫ్రీరేంజ్ పద్ధతిలో పెంచుతున్న ఈయన దాణా కోసం స్థానికంగా దొరికే జొన్న , సజ్జలు ఉపయోగిస్తున్నారు. అంతే కాదు ఈ క్షేత్రం అంతా పిచ్చి మొక్కలతో నిండిపోతుండటంతో 6 నెలల క్రితం పామాయిల్ మొక్కలను నాటారు. భవిష్యత్తులో వీటి ద్వారా  ఆదాయం పొందేందుకు వీలుంది.