Baby Corn Cultivation : తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలోనే అధిక లాభాలు పొందుతున్న రైతు 

Baby Corn Cultivation : ఈ కోవలోనే గత కొన్నేళ్లుగా రబీలో మొక్కజొన్న సాగుచేస్తూ.. మంచి ఫలితాలను పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువరైతు.

Baby Corn Cultivation : తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలోనే అధిక లాభాలు పొందుతున్న రైతు 

Earn better profit from baby corn cultivation

Baby Corn Cultivation : మొక్కజొన్న.. రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా చెప్పవచ్చు.  వరి తరువాత తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన ఆహారధాన్యపు పంట కూడా ఇదే.  తక్కువ పంట కాలం, దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ కోవలోనే గత కొన్నేళ్లుగా రబీలో మొక్కజొన్న సాగుచేస్తూ.. మంచి ఫలితాలను పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువరైతు.

Read Also : Watermelon Cultivation : పుచ్చసాగుతో లాభాల బాటలో నిర్మల్ జిల్లా రైతు

ఖరీఫ్‌లో వరిసాగు, రబీ పంటగా మొక్కజొన్న సాగు : 
స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న.. రైతుల ఆదరణ పొందుతుంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా   , రబీలో నీటిపారుదల కింద సాగుచేస్తుంటారు రైతులు . మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ళ దాణాలో ప్రధాన ముడి సరుకుగాను, చొప్పను పచ్చిమేత కోసం సాగుచేస్తారు. పేలాలు, స్వీట్ కార్నగా, బేబీకార్న్ గా ఇలా వివిధ రకాలుగా మొక్కజొన్నను సాగుచేసేందుకు పలురకాల హైబ్రిడ్ లు అందుబాటులో ఉన్నాయి.

తక్కువ పెట్టుబడి.. సాగు సులువు కాబట్టి ఏలూరు జిల్లా, కోయ్యలగూడెం మండలం, అంకాల గూడెం గ్రామానికి చెందిన యువరైతు గంధపు శ్యాంబాబు కొన్నేళ్లుగా ఖరీఫ్ లో వరి, రబీలో మొక్కజొన్నను సాగుచేస్తున్నారు. ఈ సారి కూడా తనకున్న 10 ఎకరాల్లో ఓ ప్రైవైట్ విత్తనాన్ని నాటారు. సమయానుకూలంగా నీటితడులు, ఎరువులు, కలుపు యాజమాన్యం చేపడుతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న కంకి పాలుపోసుకునే దశకు చేరుకుంది. ఎకరాకు 35 నుండి  45 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Mixed Cropping : మిశ్రమ పంటల సాగు.. 4 ఎకరాల్లో కొబ్బరి, నిమ్మ కోకోసాగు