Watermelon Cultivation : పుచ్చసాగుతో లాభాల బాటలో నిర్మల్ జిల్లా రైతు

Watermelon Cultivation : చలువ చేసే పుచ్చకాయలను వేసవిలో ప్రజలు అధికంగా తింటారు. దీంతో మార్కెట్‌లో పుచ్చ కాయలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పుచ్చసాగు చేపట్టారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు.

Watermelon Cultivation : పుచ్చసాగుతో లాభాల బాటలో నిర్మల్ జిల్లా రైతు

Success Story of Nirmal District Farmer for Watermelon Cultivation

Watermelon Cultivation : వేసవి వచ్చిందంటే చాలు అందరికీ పుచ్చకాయలు గుర్తుకొస్తాయి. చలువ చేసే పుచ్చకాయలను వేసవిలో ప్రజలు అధికంగా తింటారు. దీంతో మార్కెట్‌లో పుచ్చ కాయలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పుచ్చసాగు చేపట్టారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు. వచ్చిన దిగుబడులను స్థానికంగా అమ్ముతూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

Read Also : Kisan Agri Show 2024 : హైదరాబాద్‌లో అతిపెద్ద ‘కిసాన్ అగ్రి షో 2024’.. ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?

కనుచూపు మేర కనిపిస్తున్న ఈ పుచ్చపంట నిర్మల్ జిల్లా, ముధోల్ మండలం, విట్టోలితాండా గ్రామానికి చెందిన రైతు హరిసింగ్ రాథోడ్ ది.  తనకున్న 10 ఎకరాల పొలంలో 20 ఏళ్లుగా సంప్రదాయ పంటలు పండిస్తున్నారు. గత ఏడాది ప్రయోగాత్మకంగా పుచ్చను సాగుచేశారు. అధిక లాభాలు రావడంతో ఈ సారి 7 ఎకరాల్లో ప్రణాళిక బద్ధంగా దఫదఫాలుగా సాగుచేశారు.

ఎత్తైన మడులపై మల్చింగ్ ఏర్పాటు చేసి, డ్రిప్ అమర్చారు. ఎరువులు, నీటి తడులను సమయానుకూలంగా డ్రిప్ ద్వారా అందించడంతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, మంచి కాత కాసింది.  ప్రస్తుతం 4 ఎకరాల్లో ఉన్న పుచ్చ కోత దశకు వచ్చింది. వేసవి ప్రారంభం కావడంతో ధర కూడా అధికంగా పలుకుతోంది.

Read Also : Kisan Agri Show : హైదరాబాద్ హైటెక్స్‌లో కిసాన్ 2024 అగ్రి షో