Mixed Cropping : మిశ్రమ పంటల సాగు.. 4 ఎకరాల్లో కొబ్బరి, నిమ్మ కోకోసాగు

Mixed Cropping : ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 4 ఎకరాల్లో మిశ్రమ ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. అనుబంధంగా కోళ్లను పెంచుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Mixed Cropping : మిశ్రమ పంటల సాగు.. 4 ఎకరాల్లో కొబ్బరి, నిమ్మ కోకోసాగు

Mixed Cropping Agriculture Technique

Mixed Cropping : పంటల సాగులో అధికోత్పత్తి సాధించడమే రైతు యొక్క చిట్టచివరి లక్ష్యం. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపధ్యంలో నిరంతరం అధిక ఆదాయం వచ్చే దిశగా రైతుల ఆలోచనలు మారుతున్నాయి. అయితే ఈ విధానంలో రైతుల పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి అప్పుడే మంచి లాభాలను గడించవచ్చు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 4 ఎకరాల్లో మిశ్రమ ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. అనుబంధంగా కోళ్లను పెంచుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ

ఇదిగో ఈ వ్యవసాయ క్షేత్రం చూడండీ.. ఎంత పచ్చగా ఉందో. ఇటు కొబ్బరి చెట్లు అటు నిమ్మ మొక్కలు… మధ్యలో కోకో మొక్కలు.. ఈ చెట్ల మద్య తిరుగుతున్న నాటుకోళ్లు.. ఒకే క్షేత్రంలో మిశ్రమ పంటలున్న ఈ వ్యవసాయ క్షేత్రం ఏలూరు జిల్లా, దెందులూరు మండలం, రామారావు గూడెంలో ఉంది. దీనిని సాగుచేస్తున్న రైతేపుల్లా అనిల్ కుమార్.

రైతు అనిల్ కుమార్ తనకున్న 4 ఎకరాల్లో 4 ఏళ్లక్రితం కొబ్బరి మొక్కలు నాటారు. దిగుబడి వచ్చే వరకు 4 ఏళ్ల సమయం పడుతుంది.. అంతే కాదు మొక్కల మధ్య ఖాళీస్థలం అధికంగా ఉండటంతో అంతర పంటగా నిమ్మమొక్కలను నాటారు. నిమ్మనుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. తోట నిర్వాహణకు ఖర్చులు వస్తున్నాయి. అయితే మొక్కల మధ్య ఇంకా ఖాలీస్థలం ఉండటం.. గత ఏడాది కోకో మొక్కలను నాటరు. వీటితో పాటు నాటుకోళ్లను పెంచుతున్నారు. ప్రస్తుతం కొబ్బరి కాయలు కూడా కోతకు వస్తున్నాయి. మరోవైపు నాటు కోళ్ల నుండి కూడా ఆదాయం వస్తోంది. ఒకే క్షేత్రంలో మిశ్రమ వ్యవసాయం చేస్తూ..  చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్ధాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. చిన్న, సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది.

Read Also : Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం