Mango Crop : మామిడి తోటల్లో పోషక లోపాలు

బోరాన్ లోపం ఏర్పడితే ఆకులు పాలిపోయినట్లుగా కనిపిస్తాయి. కాపు దశలో కాయల్లో పగుళ్లు ఏర్పడతాయి. కాయలోపల కండ గోధుమ రంగుకు మారుతుంది.

Mango Crop : మామిడి తోటల్లో పోషక లోపాలు

Mango Tree (1)

Updated On : April 25, 2022 / 4:37 PM IST

Mango Crop : మామిడి తోటల్లో సూక్ష్మధాతు లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ లోపాల కారణంగా దిగుబడులు తగ్గుతాయి. వీటి నివారణకు రైతులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. తగిన చర్యలు చేపట్టటం ద్వారా మామిడిలో మంచి నాణ్యమైన దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.

సూక్ష్మధాతు లోపాలు;

ఇనుము ధాతు లోపం ; ఈ సమయంలో ఆకులు తెల్లగా మారతాయి. మారిమాణం తగ్గుతుంది. లోపం మరింత ఎక్కువగా ఉంటే కొనల నుంచి ఆకులు ఎండిపోతాయి. సున్నం శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో సాగు చేసిన తోటల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. చెట్లలో పెరుగుదల కాపు కూడా సరిగా ఉండదు. ఒక్కోసారి చెట్లు ఎండిపోతాయి. లోప నివారణకు లీటరు నీటికి 5గ్రా , అన్నభేది, గ్రాము నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు చెట్టు మొత్తం తడిచేలా పిచికారి చేయాలి.

జింకు లోపం ; జింకు లోపం వల్ల ఆకులు చిన్నవిగా, సన్నగా , అంచులు లోపలికి ముడుచుకుపోతాయి. ఈనెల మధ్యభాగం పాలిపోయి పచ్చగా మారతాయి. చెట్లలో ఎదుగుదల ఉండదు. కాపు, కాయ పరిమాణం, నాణ్యత తగ్గుతాయి. నివారణకు లీటరు నీటికి 5గ్రా జింక్ సల్ఫేటుతోపాటు, 10గ్రా యూరియా కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

బోరాన్ లోపం ; బోరాన్ లోపం ఏర్పడితే ఆకులు పాలిపోయినట్లుగా కనిపిస్తాయి. కాపు దశలో కాయల్లో పగుళ్లు ఏర్పడతాయి. కాయలోపల కండ గోధుమ రంగుకు మారుతుంది. దీని నివారణకు లీటరు నీటికి గ్రాము బోరాక్స్ కలిపిన ద్రావణాన్ని చెట్టు పూర్తిగా తడిసేలా పిచికారి చెయ్యాలి. జులై, ఆగస్టు నెలల్లో ఎరువులు వేసే సమయంలో ఒక్కో చెట్టుకు 100గ్రా బోరాక్స్ లేదా బోరిక్ అమ్లం వేయాలి.