Mango Farming : మామిడిలో కాయ,పిందె దశలో చేపట్టాల్సిన యాజమాన్యచర్యలు!

సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు ఈ సమయంలో పాటించే యాజమాన్యం ఒకఎత్తు. కాయ ఏర్పడే దశలో రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది.

Mango Farming : మామిడిలో కాయ,పిందె దశలో చేపట్టాల్సిన యాజమాన్యచర్యలు!

Mango Farming

Mango Farming : పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కాయ ఏర్పడే దశలో మామిడితోటలు ఉన్నాయి. మరికొన్నితోటల్లో ఇంకా పిందె ధశలో ఉన్నాయి.

ఈ సమయంలో చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు ఈ సమయంలో పాటించే యాజమాన్యం ఒకఎత్తు. కాయ ఏర్పడే దశలో రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది.

READ ALSO : Mango Harvest : మామిడిలో పూత, పిందె దశలో చేపట్టాల్సిన యాజమాన్య పద్దతులు!

తోటలు ప్రస్తుతం కాయ ఏర్పడే దశలో వున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వుండటంతో సకాలంలో పూత ప్రారంభమవటంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే పూత సమయంలో , కాయ పెరిగే దశలో తెగుళ్లు, పురుగులు ఆశించి తోటలకు నష్టం చేస్తాయి.

ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, నాగరాజు.