Black Gram Cultivation : మినుము పంటలో పల్లాకు తెగులు, మేలైన యాజమాన్య పద్ధతులు!

మినుము పంటను సెప్టెంబరు చివరి వారం నుండి నవంబరు 15 వరకు సాగు చేపట్టవచ్చు. ఎకరానికి 10 కిలోల విత్తనం అవసరమౌతుంది. ఇక ఎరువులకు సంబంధించి 20కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువులను ఎకరం పొలంలో చల్లుకోవాలి.

Black Gram Cultivation : మినుము పంటలో పల్లాకు తెగులు, మేలైన యాజమాన్య పద్ధతులు!

Pallaku pest in Black Gram Cultivation , better management practices!

Updated On : December 22, 2022 / 4:53 PM IST

Black Gram Cultivation : మినుముకు ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో రైతులు మినుము పంట వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పత్తి పంటకు మంచి ప్రత్యామ్నాయంగా మినుపంటను సాగు చేపట్టవచ్చు. మినుము పంట వర్షాధారం కలిగిన తేలికపాటి భూముల్లో , బరువు నేలల్లో సాగు చేయవచ్చు.

మినుము పంటలో ప్రధాన సమస్య పల్లాకు తెగులు. ఇటీవలి కాలంలో పల్లాకు తెగులు తట్టుకునే మంచి దిగుబడు వచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు పల్లాకు తెగులును తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని సాగు చేపడితే అధిక దిగుబడులు వస్తాయి.

పల్లాకు తెగులును తట్టుకునే రకాల సాగు ; టిబిజి 104 ; పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. గింజ పాలిష్ కలిగి ఉంటుంది. పంటకాలం 80 నుండి 85 రోజులు ఉంటుంది. జిబిజి1 ఇది పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. గింజ పాలిష్ కలిగి ఉంటుంది. పంటకాలం 85 రోజులు. పియు 31 ఇది కూడా పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. గింజసాదాగా ఉంటుంది. పంటకాలం 85 రోజులు. మినుములో విత్తన శుద్ధి కోసం గౌచ్ అనే మందును ఒక కిలో విత్తనానికి 5 మి.లీ కలిపి విత్తనశుద్ధి చేయాలి.

మినుము పంటను సెప్టెంబరు చివరి వారం నుండి నవంబరు 15 వరకు సాగు చేపట్టవచ్చు. ఎకరానికి 10 కిలోల విత్తనం అవసరమౌతుంది. ఇక ఎరువులకు సంబంధించి 20కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువులను ఎకరం పొలంలో చల్లుకోవాలి. కలుపు సమస్య ఉన్నట్లైతే విత్తనం విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 1.5 లీటర్లు మందును పిచికారి చేయాలి. విత్తనం విత్తిన 15 నుండి 20 రోజులకు ఇమితాజాఫిర్ ఎకారానికి 200 మి.లీ పిచికారి చేయాలి.