Green Gram : రబీకి అనువైన పెసర రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

పెసరను మధ్యస్థ నేలలు , ఎర్ర చెల్కా నేలలు, నల్ల రేగడి నేలల్లో సాగుచేసుకోవచ్చు. చౌడునేలలు, మురుగునీరు నిలిచే భూములు పనికిరావు. ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక చాలా ముఖ్యం.

Green Gram : రబీకి అనువైన పెసర రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

Green Gram

Updated On : October 7, 2023 / 1:33 PM IST

Green Gram : తక్కువ పెట్టుబడులతో, స్వల్పకాలంలో అందివచ్చే అపరాలపంట అయిన పెసర రైతుకు అన్ని విధాలా కలసివస్తోంది. సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని, సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 4 నుండి 7 క్వింటాళ్ళ వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్థుతం రబీ పంటగా పెసరను సాగుచేసే రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. జగన్ మోహన్ రావు.

READ ALSO : ECI: ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ వ్యాఖ్యల్లో నిజమెంత.. డబ్బు, మద్యం చేరాల్సిన చోటుకు చేరిపోయాయా?

ఖరీఫ్ సీజన్ లో మంచి వర్షపాతం నమోదైనప్పటికీ .. కొన్ని మండలాల్లో భూగర్భ జలాలు సాధారణ స్థాయికి చేరుకోలేదు. దీంతో రబీలో ఆరుతడి పంటలుగా అపరాలను సాగు చేయటం ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంటల మార్పిడిలో భాగంగా వీటిని సాగుచేస్తే, భూసారం కూడా పెంపొందేందుకు వీలుంటుంది. ఖరీఫ్ వరి సాగుకు నోచుకోని ప్రాంతాలు, తొలకరిలో సోయాచిక్కుడు సాగుచేసిన ప్రాంతాల్లో ఒకటి రెండు నీటి తడులతో చేతికొచ్చే పెసర పంట సాగు రైతుకు అన్నివిధాలుగా అనుకూలం.

READ ALSO : Bad Breath : నోటి దుర్వాసనకు విటమిన్ డి లోపం ఒక కారణమా?

సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 20 వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్టోబర్ చివరి వరకు వెళ్లాలే తప్ప, ఎలాంటి పరిస్థితుల్లో నవంబర్ లో విత్తుకోరాదు. పెసరలో అధిక దిగుబడులను పొందేందుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. జగన్ మోహన్ రావు.

పెసరను మధ్యస్థ నేలలు , ఎర్ర చెల్కా నేలలు, నల్ల రేగడి నేలల్లో సాగుచేసుకోవచ్చు. చౌడునేలలు, మురుగునీరు నిలిచే భూములు పనికిరావు. ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక చాలా ముఖ్యం. రబీ పెసరసాగు కు అనువైన రకాలు వాటి గుణ గణాలేంటో తెలియజేస్తున్నారు డా. జగన్ మోహన్ రావు. పెసర పంట తొలిదశలో చీడపీడల బెడదను అధిగమించేందుకు విత్తన శుద్ధి చాలా ముఖ్యం . దీనిద్వారా విత్తిన 20 నుండి 20 రోజుల వరకు ఎటువంటి రసాయన మందులు వాడకుండా పంటను కాపాడుకోవచ్చు. అలాగే భూమిద్వారా వ్యాపించే శిలీంధ్ర తెగుళ్ల నుండి కూడా పంటను రక్షించుకోవచ్చు.

READ ALSO : Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్.. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా.. ఎలక్షన్స్ ముందే రిలీజ్..

రబీ పెసరలో ముఖ్యంగా విత్తన మోతాదు, సాళ్ల మధ్య దూరం జాగ్రత్తగా పాటించాలి . మరోవైపు విత్తన 24 గంటల్లోపు కలుపు నివారణ చర్యలు చేపడితే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి , అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.