Bad Breath : నోటి దుర్వాసనకు విటమిన్ డి లోపం ఒక కారణమా?

విటమిన్ డి లోపం అన్నది చాలా సాధారణమైనది. ముఖ్యంగా భారతదేశంలో, చాలా మందికి తగినంత సూర్యకాంతి లభించదు. అలసట, కండరాల నొప్పి, తరచుగా వచ్చే అనారోగ్యాలు సమస్యలు విటమిన్ డి లోపం వల్లే కావచ్చు.

Bad Breath : నోటి దుర్వాసనకు విటమిన్ డి లోపం ఒక కారణమా?

Vitamin D

Bad Breath : నోటి పరిశుభ్రత విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు పాటించినా నోటి నుండి దుర్వాసన వెదజల్లటాన్ని చాలా మంది గమనించే ఉంటారు. ఈ నోటి దుర్వాసనను హాలిటోసిస్ అని కూడా పిలుస్తారు, ఈ సమస్య చాలా మందిని నిత్యం ఇబ్బంది కలిగించటతోపాటు అసౌకర్యానికి గురిచేస్తుంది. చాలా మంది తినే ఆహారమే ఇలా దుర్వాసనకు కారణమని భావిస్తుంటారు. అయితే ఇలా నోటి దుర్వాసన సమస్య ఎదుర్కొంటున్నారంటే శరీరంలో ఏదో విటమిన్ లోపం కావచ్చు. ముఖ్యంగా విటమిన్ డి లోపం కారణంగా నోటి నుండి ఈ తరహా దుర్వాసనలు వెలువడే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Tooth Decay : దంతాలు పుచ్చిపోవటానికి కారణాలు తెలుసా! పుచ్చిపోకుండా ఉండాలంటే ఏంచేయాలి?

విటమిన్ డి ఎందుకు అవసరం?

విటమిన్ డి మన మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా కీలకమైనది. ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పనితీరు, మానసిక శ్రేయస్సులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్న చాలా మందికి తెలియదు.

విటమిన్ డి లోపం వల్ల నోటి దుర్వాసన ఎలా వస్తుంది?

2022లో ఇండియన్ జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం విటమిన్ డి లోపం , నోటి దుర్వాసన మధ్య సంబంధాన్ని కనుగొంది. విటమిన్ డి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ ముఖ్యమైన పోషకం లోపిస్తే హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది నోటి దుర్వాసనతో సహా నోటి సమస్యలకు దారితీస్తుంది.

READ ALSO : CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!

విటమిన్ డి లోపం వల్ల నోటి దుర్వాసన వస్తుందో లేదో తెలుసుకోవడం ఎలా?

విటమిన్ డి లోపం అన్నది చాలా సాధారణమైనది. ముఖ్యంగా భారతదేశంలో, చాలా మందికి తగినంత సూర్యకాంతి లభించదు. అలసట, కండరాల నొప్పి, తరచుగా వచ్చే అనారోగ్యాలు సమస్యలు విటమిన్ డి లోపం వల్లే కావచ్చు. సూర్యరశ్మి సమృద్ధిగా ఉంటే విటమిన్ డి లోపం ఉండదు. అయితే జీవనశైలి కారకాలు, ఎక్కువ సమయం ఇంటి లోపల గడపడం,సన్‌స్క్రీన్ ఉపయోగించడం వంటివి విటమిన్ డి ఉత్పత్తి కాకుండా చేస్తాయి. కొవ్వు చేపలు, గుడ్లు , బలవర్థకమైన ఆహారాలు విటమిన్ డి లోపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

శ్వాస తాజాగా ఉండాలంటే?

ప్రతిరోజు ఎండలో కొంత సమయం గడపడం వల్ల శరీరం సహజంగా విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ప్రతిరోజూ చర్మంపై సుమారు 15-20 నిమిషాల సూర్యరశ్మి పడేలా చూసుకోండి. ఒమేగా 3 కొవ్వు కలిగిన చేపలు, గుడ్డు సొనలు, పాల ఉత్పత్తులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దంతాలను క్రమం తప్పకుండా బ్రష్ చేయాలి. మౌత్ వాష్ ఉపయోగించటంతోపాటు నాలుకను శుభ్రం చేయడం మర్చిపోకూడదు. నోరు పొడిబారి పోకుండా లాలాజల ఉత్పత్తి అయ్యేందుకు తగినంత నీరు త్రాగటం చాలా అవసరం. ఇలా చేయటం వల్ల నోరు శుభ్రపడుతుంది. దుర్వాసన ఉండదు.

READ ALSO : Acidic Foods : అమ్లగుణంతో కూడిన ఆహారాలు తింటే దంతాలు పచ్చగా మారతాయా?

తాజా శ్వాస కోసం,నోటి ఆరోగ్యంలో విషయంలో విటమిన్ డి కీలకమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నోటి దుర్వాసనకు ఇదొక్కటే కారణం కానప్పటికీ, తగినంత విటమిన్ డి స్థాయిలు కలిగి ఉండటం మంచిది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.