Ginger Cultivation : అల్లంసాగులో రైతులు పాటించాల్సిన మెలకువలు

విత్తిన దుంపలను నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. మొలకెత్తిన మొలకలు విరిగి పోకుండా విత్తన కొమ్ములను విత్తడానికి 10 రోజుల ముందు మంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వల్ల మంచి మొలక శాతం వస్తుంది.

Ginger Cultivation : అల్లంసాగులో రైతులు పాటించాల్సిన మెలకువలు

Ginger Cultivation

Ginger Cultivation : తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో రైతులు అల్లం సాగు చేస్తున్నారు. అల్లం పంటకు వాణిజ్యపరంగా మంచి గిరాకీ ఉండటంతో సాగు విస్తీర్ణం అంతకంతకూ పెరుగుతుంది. రైతులు ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ అల్లంసాగు చేపడితే మంచి దిగుబడి పొందటంతోపాటు, అదాయం కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది.

READ ALSO : Soybean Cultivation : సోయాబీన్ సాగులో చీడపీడలు సస్యరక్షణ చర్యలు!

రైతులు పాటించాల్సిన మెళకువలు ;

వాతావరణం ; వాణిజ్యపరంగా అల్లం సాగుకు నీటి వసతి బాగా ఉండాలి. తేమతో కూడిన పొడి, వాతావరణం ఉన్న ప్రాంతాలు అనుకూలం. పాక్షికంగా నీడ ఉన్న తోటల్లో అంతర పంటగా సాగు చేయవచ్చు.

నేలలు: బరువైన బంక మట్టి నేలలు, మురుగు నీటి సౌకర్యం లేని నేలలు అల్లం సాగుకు అనుకూలం కావు. దీనివల్ల కొమ్మకుళ్ళు సమస్య వస్తుంది. ఎర్ర చల్క భూములు, గరప భూములు, సారవంతమైన తేలికపాటి నల్ల భూములు అనుకూలం.

READ ALSO : Chamanti Cultivation : చామంతి సాగులో చీడపీడలు, తెగుళ్ళ నివారణ !

అనువైన రకాలు : సిద్దిపేట, మారన్‌, విఎస్‌ 1-8, నాడియం, నర్శిపట్నం వంటి అల్లం రకాలు అధిక దిగుబడినిస్తాయి.

విత్తన మోతాదు: ఎకరాకు 600-800 కేజీల విత్తనం అవసరం.

విత్తేసమయం: ఏప్రిల్‌ రెండు, మూడవ వారం నుండి మే నెల మూడవ వారం లోగా విత్తుకోవాలి. వాతావరణం అనుకూలంగా లేనపుడు భూమి తయారి ఆలస్యం అయినపుడు మే నెల చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తడం ఆలస్ట్యమైతే దుంప కుళ్ళు ఆశించి దిగుబడులు తగ్గుతాయి.

READ ALSO : Prevent Pests In Cotton : పత్తిలో చీడపీడలు నివారించేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

విత్తన ఎంపిక : తెగులు సోకని పంట నుంచి బలమైన విత్తన దుంపలను ఎన్నుకోవాలి. మొలక వచ్చిన దుంపలను సుమారు 25-30 గ్రాముల బరువు ఉండేలా ముక్కలుగా చేసి విత్తుకోవాలి. మొలకలు బాగా రావడానికి దుంపలను నీడలో రెండు వారాల పాటు ఆరబెట్టాలి.

విత్తన శుద్ధి: నీటరు నీటికి 3 గ్రాముల రెడోమిల్‌ ఎమ్‌జెడ్‌ లేదా 3 గ్రాముల మాంకోజెబ్‌ మరియు 5 మి.లీ.ల క్లోరిపైరిఫాస్‌ ద్రావణాన్ని కలిపి ఆరోగ్యకరమైన దుంపలను ద్రావణంలో 80-40 నిమిషాలు నానబెట్టాలి.

READ ALSO :  Toor Dal : కందిపంటలో చీడపీడలు…సస్యరక్షణ

రసాయన శుద్ధి చేసిన తర్వాత లీటరు నీటికి 4-5 గ్రాముల ట్రైకోడెర్మ విరిడి కలిపి ఆ ద్రావణంలో దుంపలను 30-40 నిమిషాలు నానబెట్టిన తర్వాత విత్తుకోవాలి.

మడుల తయారీ, నాటడం : భూమిని బాగా దున్ని మెత్తగా చేసినతర్వాత ఎత్తైన సమతల మడులు చేసుకుని నీటి పారుదల, మురుగు నీటి కాలువలు, ఒకదాని పక్కని ఒకటి ఉండేలా చేసుకోవాలి. నీటి పారుదల కాలువలు 20-30 సెం.మీ. లోతు, మురుగు, నీటి కాలువలు 45 సెం.మీ లోతు ఉండేలాగా త్రవ్వాలి. లేని పక్షంలో బోదెలు, కాలువలు 40-45 సెం.మీ. ఎడంలో ఏర్పాటు చేసి బోదెలపై నాటడం అన్ని రకాలుగా మంచిది.

విత్తిన దుంపలను నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. మొలకెత్తిన మొలకలు విరిగి పోకుండా విత్తన కొమ్ములను విత్తడానికి 10 రోజుల ముందు మంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వల్ల మంచి మొలక శాతం వస్తుంది. దీంతో పాటుగా భూమిని బట్టి అనువైన పొడవు, మరియు. వెడల్పు 15 సెం.మీ. ఎత్తు బెడ్‌లను తయారు చేసి బెడ్‌ మీద 4 వరుసల్లో దుంపలు నాటి బిందు సేద్యం ద్వారా సాగు చేసి మంచి ఫలితాలు పొందవచ్చు.

READ ALSO : Chilli Crop : మిర్చి పంటపై తెగుళ్ల దాడి.. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు

నాటిన రెండు, మూడు వారాలకు దుంపలు మొలకెత్తుతాయి. మొక్కలు రెండు అడుగుల ఎత్తు పెరిగనపుడు వరుసల మధ్యలో మొక్కజొన్న ఆముదం వంటి పంటలు వేసి పంటకు కావల్సిన నీడ కల్పించాలి. నాటిన రెండు, మూడు వారాలకు , 60 రోజులకు ఒకసారి అల్లం నాటిన బోదెలకు మట్టిని ఎగదోయాలి.