Shrimp Diseases : నల్లబెల్లంతో.. రొయ్యల వ్యాధులకు చెక్

నాణ్యమైన పిల్ల దొరక్కపోవడంతో పాటు, మేత కారణంగా నష్టాలు చూడాల్సి వస్తోంది.  ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు తగ్గించుకుంటూ, రొయ్య పిల్లల వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు మేతలో నల్లబెల్లం వాడుతున్నారు

Shrimp Diseases : నల్లబెల్లంతో.. రొయ్యల వ్యాధులకు చెక్

prevent common shrimp diseases

Updated On : June 25, 2023 / 12:54 PM IST

Shrimp Diseases : దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వారంగంలో, సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రొయ్యల కల్చర్ లో వివిధ బాక్టీరియా వైరస్ వ్యాధుల దాడి కల్చర్ ను అతలాకుతలం చేస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా ఈ సమస్యల తీవ్రత మరింత పెరుగుతోంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు నల్లబెల్లం కలిపిన ఫీడ్ ను చెక్ ట్రే పద్ధతిలో అందిస్తూ.. సత్ఫలితాలను పొందుతున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొందరు రైతులు.

READ ALSO : Shrimp farming: బయోప్లాక్ విధానంలో..సూపర్ ఇంటెన్సివ్ రొయ్యల సాగు

వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. అందులో రొయ్యల పెంపకం ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో వనామి రొయ్యల సాగు విస్తృతంగా సాగవుతోంది. అయితే, వాతావరణ మార్పులు , పలు రకాల వ్యాధులు వస్తున్నాయి.

READ ALSO : Polyculture System : పాలీకల్చర్ విధానంలో రొయ్యలు, చేపల పెంపకం

వీటికితోడు నాణ్యమైన పిల్ల దొరక్కపోవడంతో పాటు, మేత కారణంగా నష్టాలు చూడాల్సి వస్తోంది.  ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు తగ్గించుకుంటూ, రొయ్య పిల్లల వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు మేతలో నల్లబెల్లం వాడుతున్నారు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలం, వెంప గ్రామానికి చెందిన కొందరు రైతులు. అంతే కాదు ఫీడ్ ను వృధా చేయకుండా చెక్ ట్రే విధానంలో అందిస్తున్నారు.

READ ALSO : Shrimp Cultivation : రొయ్యలకు వైరస్ ల ముప్పు.. సమయానుకూలంగా చేపట్టాల్సిన జాగ్రత్తలు

చెక్ ట్రేలను ఉపయోగించి చేపల చెరువుల్లో మేత అందించడం ద్వారా ఎంత ఫీడ్ వేస్తున్నామనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. దీంతోపాటు.. మనం అందించిన ఫీడ్ ని రొయ్యలు ఎంతమేర తింటున్నాయో తెలుసుకోవచ్చంటున్నారు రైతులు. అంతే కాదు నల్లబెల్లం ద్రావణం వ్యాధుల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.