Chicks with Incubator : ఇంక్యూబేటర్‌తో కోడిపిల్లల ఉత్పత్తి

Chicks with Incubator : ఇది తరతరాలుగా మనం చూస్తున్నదే. ప్రత్యేకంగా చెప్పుకోనేదేమీ ఉండదు. పెద్దపెద్ద కోళ్లఫారాల్లో కోడిని పొదిగేయాల్సిన అవసరం లేకుండానే యంత్రాల ద్వారా పిల్లల ఉత్పత్తి అవుతాయి.

Chicks with Incubator : ఇంక్యూబేటర్‌తో కోడిపిల్లల ఉత్పత్తి

Production of Chicks with Incubator

Updated On : March 14, 2024 / 4:25 PM IST

Chicks with Incubator : ఒక తట్టలో కాసింత గడ్డి వేసి దాంట్లో గుడ్లను వేసి కోడిని పొదిగిస్తే 21 రోజులకు కోడిపిల్లలు బయటకు వస్తాయి. ఇది తరతరాలుగా మనం చూస్తున్నదే. ప్రత్యేకంగా చెప్పుకోనేదేమీ ఉండదు. పెద్దపెద్ద కోళ్లఫారాల్లో కోడిని పొదిగేయాల్సిన అవసరం లేకుండానే యంత్రాల ద్వారా పిల్లల ఉత్పత్తి అవుతాయి. అయితే అంత వెచ్చించి కోడిపిల్లల ఉత్పత్తి చేయలేరు. దీన్నే ఆసరాగా తీసుకొని ఇంక్యూబేటర్ సహాయంతో కోడిపిల్లల ఉత్పత్తి చేస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు.

Read Also : Paddy Cultivation : ప్రకృతి విధానంలో జైశ్రీరాం రకం వరి సాగు

వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు.. తగ్గుతున్న దిగుబడులకు తోడు మార్కెట్ లో గిట్టుబాటు ధర రావడంలేదు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా, దెందులూరు మండలం, రామారావు గూడెం గ్రామానికి చెందిన రైతు పుల్లా సత్యనారాయణ వ్వవసాయానికి అనుబంధంగా నాటుకోడిపిల్లల ఉత్పత్తిని చేపట్టారు. ఇందుకోసం 1500 పిల్ల ఉత్పత్తి కెపాసిటి కలిగిన ఇంక్యూబేటర్ ను రూ. 5 లక్షలకు కొనుగోలు చేశారు.

తన ఇంటి వద్దే ఉంచి తన కోళ్లు పెట్టిన గుడ్లతో పాటు.. చుట్టుప్రక్కల గ్రామాల రైతులు తీసుకొచ్చిన నాటుకోడి గుడ్లను ఇంక్యూబేటర్ లో పొదిగించి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు.  ఒక్కో కోడిపిల్ల ఉత్పత్తి కావాలంటే 21 రోజుల సమయం పడుతుంది. గుడ్ల జాతికి చెందిన ప్రతి పక్షి గుడ్డు పిల్లగా మార్చుతుంది ఈ ఇంక్యుబేటర్.  అయితే  ఒక్కొక్క పిల్ల ఉత్పత్తికి 15 రూపాయల చార్జ్ చేస్తున్నారు.  అంతే కాదు తాను సొంతంగా పిల్లల ఉత్పత్తి చేస్తూ.. వాటిని అమ్ముతూ కూడా మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

Read Also : Summer Ridge Gourd Cultivation : వేసవి బీర సాగులో మెళకువలు.. పందిరి కూరగాయలతో అధిక ఆదాయం