Promoting Beekeeping : ఉపాధికి డోకాలేని పరిశ్రమగా తేనెటీగల పెంపకం
తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండడంతో, తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. దీంతో చాలా మంది రైతులు ఈ పరిశ్రమ వైపు మొగ్గుచూపుతున్నారు.

Scientists Promoting Beekeeping
Promoting Beekeeping : తేనెటీగల పెంపకం వ్యవసాయాధార పరిశ్రమ. రైతులు అదనపు ఆదాయం కోసం తేనేటీగల పెంపకం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే అడవుల నుంచి తేనె సేకరించడమనేది ఎప్పటి నుంచో వున్నదే. తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండడంతో, తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. దీంతో చాలా మంది రైతులు ఈ పరిశ్రమ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇందులో భాగంగానే ఒ స్వచ్చంద సంస్థ , ఖాదీ బోర్డు సహాకారంతో, తేనెటీగల పెంపకం పట్ల ఆసక్తి ఉన్న యువతకు శిక్షణ ఇస్తూ, వారికి ఉపాధిమార్గాన్ని సూచిస్తోంది.
READ ALSO : Honey Bees: తేనె పరిశ్రమ కాపాడుకునేందుకు తేనెటీగలు చంపేస్తున్న ఆస్ట్రేలియా
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలికాలంలో విస్తరిస్తున్న వ్యవసాయ అనుబంధ పరిశ్రమ తేనెటీగల పెంపకం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పరిశ్రమ ద్వారా, రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. దేశ విదేశాల్లో తేనె ఉత్పత్తులకు నానాటికీ డిమాండ్ పెరగుతుండటం వల్ల, దేశీయంగా ఈ పరిశ్రమను విస్తరించేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కొన్ని ఎన్.జి.వో సంస్థలతో కలిసి తేనెటీగల పెంపకం పట్ల ఆసక్తి ఉన్న యువతకు, రైతులకు శిక్షణ ఇస్తోంది.
ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే అద్భుతమైన వనరుల్లో తేనెను, మానవజాతిపాలిట వరప్రసాదంగా చెప్పవచ్చు. వివిధ రకాల పంటలు, చెట్ల పూల నుంచి, తేనెటీగలు సేకరించే తియ్యని మకరందమే తేనె. ఇది వెలకట్టలేనిది. స్వచ్చమైన తేనె ఎన్నటికీ చెడిపోదు. పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె, క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది.
READ ALSO : కిలో తేనె ఖరీదు రూ.8.8 లక్షలు..గుహల్లో లభ్యమయ్యే రమ్యమైన హనీ..బంగారం కంటే కాస్ట్లీ..
అందుకే ఆయిర్వేదంలో దీనికి సర్వరోగ నివారిణిగా పేరుంది. శరీర బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా వైద్యుల సూచనల మేరకు రోజూ చెమ్చాడు తేనె తీసుకుంటే సరి. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె, ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది. చెక్క పెట్టెల్లో ఫ్రేముల అమర్చి, తేనెటీగలను మచ్చిక చేసుకోవటంద్వారా…కృత్రిమంగా పెంచే ఈ పెంపకం ఎంతోమందికి జీవనోపాధిగా మారింది. తక్కువ పెట్టుబడితో మంచి ఫలితాలను ఇస్తున్నఈ పరిశ్రమ నేడు దినదినాభివృద్ధి చెందుతోంది.
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో సంవృద్ది సొసైటి వారు తేనెటీగల పెట్టెలను ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న రైతులకు, తేనెటీగల పెంపకం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు.. తేనెటీగల పెంపకం చేపట్టాలనుకునే యువతకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మార్గాన్ని చూయిస్తోంది. భూమిలేని నిరుపేదలు, నిరుద్యోగ యువతకు మంచి ఉపాధినిస్తున్న ఈ పరిశ్రమలో, లాభాలకు కొదవలేదు.
READ ALSO : Beekeeping : తేనెటీగల పెంపకం, యాజమాన్య పద్ధతులు!
సంవత్సరం పొడవునా తేనే ఉత్పత్తి వుండటం, ఎంత కష్టపడితే అంత లాభం అనే విధంగా, ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. తేనె ఉత్పత్తి ద్వారా నెలకు 50 వేల నుండి లక్ష రూపాయల నికర లాభం సాధిస్తున్నారంటే అతిశయోక్తికాదు. అయినా కొత్తగా ఈ పరిశ్రమ చేపట్టాలనుకునే వారికి, ఎలాంటి నిబంధనలు లేకుండా ఆంధ్రాబ్యాంక్ రుణాలను ఇస్తోంది.