Chilli Cultivation : ఖరీఫ్ వర్షాధార మిరపసాగు – వెదపద్ధతిలో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం 

Chilli Cultivation : నీటిపారుదల కింద సెప్టెంబరు రెండవ పక్షం నుండి మిరప నాట్లు వేస్తుండగా, వర్షాధారంగా జూలై , ఆగష్టులో మిరప విత్తుతారు. వెద మిరపలో అధిక దిగుబడికి పాటించాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Chilli Cultivation : ఖరీఫ్ వర్షాధార మిరపసాగు – వెదపద్ధతిలో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం 

Chilli Cultivation

Updated On : June 2, 2024 / 11:39 PM IST

Chilli Cultivation : వర్షాధారంగా మిరప సాగుచేసే రైతాంగం విత్తనాన్ని నేరుగా వెదబెట్టటం ఆనవాయితీగా వుంది. ఈ విధానంలో నారు మడిని పెంచే అవసరం వుండదు. పొలంలో విత్తనం నేరుగా మొలకెత్తి నిలదొక్కుకుంటుంది. ఈ పద్ధతిలో సాగు ఖర్చులు తగ్గటంతోపాటు రైతుకు కొంత పంటకాలం కూడా కలిసి వస్తుంది. నీటిపారుదల కింద సెప్టెంబరు రెండవ పక్షం నుండి మిరప నాట్లు వేస్తుండగా, వర్షాధారంగా జూలై , ఆగష్టులో మిరప విత్తుతారు. వెద మిరపలో అధిక దిగుబడికి పాటించాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Orange Cultivation : ప్రస్తుతం బత్తాయి తోటల్లో వేయాల్సిన ఎరువులు

అధిక దిగుబడి నిస్తున్న రకాలు, హైబ్రిడ్లతో మిరపసాగులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మిరపను ఖరీఫ్ లో వర్షాధారంగాను, రబీలో నీటి వసతి కింద సాగుచేస్తారు. వర్షాధారంగా సాగుచేసే మిరపలో విత్తనాన్ని నేరుగా వెదబెట్టి సాగుచేస్తారు. నీటిపారుదల కింద 6నుండి 7 కోతల్లో మిరప దిగుబడి వస్తుండగా వర్షాధార మిరప రెండు మూడు కోతల్లో పంట పూర్తవుతుంది.

అయితే, వేద మిరపలో సాగు ఖర్చు తక్కువ. కానీ ఏటా వైరస్ తెగుళ్లు, భూమి ద్వారా ఆశించే శిలీంధ్రపు తెగుళ్ల సమస్య పెరిగిపోవటం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వర్షాధార మిరపను విత్తేటప్పుడు నాణ్యమైన విత్తన ఎంపికతోపాటు, సాగు యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే, తొలిదశలో వచ్చే సమస్యలను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు గుంటూరు జిల్లా లామ్ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. శారద.

మిరప సాగుచేసే  రైతాంగం  ముందుగా లోతు దుక్కులు చేయాలి. మిరప తర్వాత మిరప వేసే పొలాల్లో తప్పనిసరిగా పంటమార్పిడి చేయాలి. ఎకరానికి 5 నుండి 10 టన్నుల పశువుల ఎరువు తోలి భూమిలో కలియ దున్నాలి. పశువుల ఎరువు లభ్యత లేనప్పుడు పచ్చిరొట్ట పైర్లు సాగుచేయాలని సూచిస్తున్నారు డా. శారద.  మిరపను నీరు ఇంకే స్వభావం వున్నబలమైన నేలల్లో సాగుచేస్తున్నారు. నేల స్వభావాన్నిబట్టి మొక్కల సాంద్రతను నిర్ణయించుకుని, తదనుగుణంగా మొక్కల మధ్య దూరాన్ని పాటించాలి.

మిరప విత్తిన 20 రోజుల తర్వాత అంతరకృషి చేయటం ద్వారా మట్టిని మొక్కల మొదళ్లకు ఎగదోసి కలుపును సమర్ధంగా అరికట్టవచ్చు. ఈ సమయంలో కుదుళ్లలో ఎక్కువగా వున్న మొక్కలను తీసివేసి పలుచన చేయాలి. కుదురుకు ఒకటి రెండు మొక్కలను మాత్రమే వుంచాలి. నిర్ధేశించిన ఎరువులను పరిమితికి మించకుండా వాడుతూ, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరిస్తే వెదబెట్టిన మిరపలో కూడా, తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించవచ్చు.

Read Also : Groundnut Cultivation : వేరుశనగ సాగులో మేలైన యాజమాన్యం