Paddy Cultivation : వానాకాలం వరిలో పురుగుల నివారణ..

Paddy Cultivation : తెలంగాణలో చెరువుల కింద, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 50 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంటలో అధిక శాతం సన్నగింజ రకాలను సాగుచేస్తున్నారు.

Paddy Cultivation : వానాకాలం వరిలో పురుగుల నివారణ..

Paddy Cultivation

Paddy Cultivation : ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే పలకరించాయి. అందుకు తగ్గట్టుగానే రైతులు వరిసాగును చేపడుతున్నారు. ఇప్పటికి  కొన్ని చోట్ల వరినారుమడులు పోసుకున్నారు… అయితే వానకాలం వరిసాగులో అధికంగా ఉల్లికోడు, సుడిదోమ, మొగి పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇవి ఆశిస్తే 10 నుండి 30 శాతం దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.  ఇందుకోసం నారుమడి దశనుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

తెలంగాణలో చెరువుల కింద, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 50 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంటలో అధిక శాతం సన్నగింజ రకాలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం దీర్ఘకాలిక రకాలను నారుమడులు పోసుకున్నారు రైతులు. మరికొంత మంది రైతులు మధ్య , స్వల్పకాలిక రకాలను   నారుమడులు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ఖరీఫ్ వరిని పురుగులు ఆశించి తీవ్రనష్టం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉల్లికోడు, సుడిదోమ, మొగి పురుగులు తీవ్రనష్టం చేసే అవకాశం ఉంది. వీటిని నారుమడి తొలిదశ నుండి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించనట్లయితే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.  వరిలో ఆశించే పురుగుల నివారణకు సస్యరక్షణ చర్యల గురించి రైతులకు  తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్.

వరిపైరును నష్టపరిచే వాటిల్లో సుడిదోమ ఒకటి. ఇది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఆశిస్తుంది. వర్షాల వల్ల నీటి నిల్వ వున్న ప్రాంతాల్లో ఈ దోమ తాకిడి అధికంగా ఉంటుంది. సుడిదోమను గోధమరంగు దోమ అని, బ్రౌన్ ప్లాంట్ హాపర్ అని పిలుస్తారు. దీన్ని గమనించటం ఆలస్యమైతే కేవలం 3, 4 రోజుల్లోనే పంటను పూర్తిగా నాశనం చేసేస్తుంది. వరిపైరుకు తీవ్రనష్టం కలిగించే ఈ సుడిదోమ నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్చలు చేపట్టాలి.

వరిసాగయ్యే అన్నిప్రాంతాల్లోను మొగి పురుగుల దాడి సర్వసాధారణంగా మారిపోయింది. ఇది నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఇవి ఆశించినట్లయితే పిలకలు ఎండిపోతాయి. వీటని చేతితో లాగితే తేలిగ్గా ఊడివస్తాయి. కాండాన్ని చీల్చిచూసినప్పుడు లోపల పురుగును గమనించవచ్చు.  ఈ పురుగు 40 రోజులపాటు పైరుకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను ఇప్పుడు చూద్దాం.  

Read Also : Kharif Crops : ఖరీఫ్ పంటల సాగులో పాటించాల్సిన యాజమాన్యం