Sheep Farming : చలికాలంలో గొర్రెలకు పెరగనున్న వ్యాధులు – నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు
Sheep Farming : ఆరోగ్యవంతమయిన గొర్రెల మంద కావాలంటే వాటికి సరైయిన షోషక ఆహారం అవసరం. మంచి యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి.

Sheep Farming
Sheep Farming : దేశ గ్రామీణ జీవన విధానంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తూ.. వారి జీవన ప్రమాణాలను పెంచడంలో గొర్రెల పెంపకం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కానీ శీతాకాలంలో గొర్రెలు, మేకలు ఎక్కువగా వ్యాధుల భారిన పడి చనిపోతుంటాయి. చలికాలంలో గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జీవాల పెంపకందార్లకు తెలియజేస్తున్నారు, పి.వి. వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్ హెడ్ డా. ఆర్.ఎమ్. వి. ప్రసాద్ .
ఆరోగ్యవంతమయిన గొర్రెల మంద కావాలంటే వాటికి సరైయిన షోషక ఆహారం అవసరం. మంచి యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి. ఈ రోజుల్లో గొర్రె మాంసానికి చాలా డిమాండ్ ఉన్నది. గొర్రెల ద్వారా గ్రామీణ రైతులు లాభం పొందడానికి ఎంతో అవకాశం ఉన్నది. 20 కిలోల బరువున్న గొర్రె, 13 కిలోల మాంసాన్ని ఇస్తుంది. కానీ గొర్రె పుట్టినప్పటి నుంచి జాగ్రత్తగా పోషకాహారాలు సరైన మోతాదులో సమక్రంగా ఇస్తేనే.. తక్కువ కాలంలో వాటి బరువు పెరిగి మాంసోత్పత్తికి తోడ్పడుతుంది.
ఎక్కువగా గొర్రెలు శీతాకాలంలో అనారోగ్యనికి గురి అవుతాయి. దీంతో గొర్రెల్లో మాంసత్పత్తి తగ్గుతుంది. కాబట్టి చలికాలంలో గొర్రెల పెరుగుదలలోనూ, పోషణలోనూ, ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ వహించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, గొర్రెల్లో జీర్ణకోశ సమస్యలు తలెత్తడంతో పాటు .. రైతు ఆర్థికంగా నష్టపోతాడు. ప్రస్తుతం చలికాలంలో గొర్రెల పెంపకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని పి.వి. నరసింహారావు, వెటర్నరీ కాలేజి ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్. ఆర్.ఎమ్. వి. ప్రసాద్.
గొర్రెలు చాలా సున్నితమైన జంతువులు. అలాగే వీటికి వ్యాధులు కూడా ఎక్కువగానే చెప్పాలి. అందకే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తేనే లాభాలు వస్తాయి. గొర్రెలు చిన్న చిన్న యూనిట్లుగా సమగ్ర వ్యవసాయంలో పెంచుకోవచ్చు. గొర్రెలకు అందించే దాణా వెచ్చగా ఉండేలా, పరిశుభ్రమైన నీరు అందింస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది.
Read Also : Sustainable Agriculture : స్టార్టప్‌లతోనే సుస్థిర వ్యవసాయం