Soybean Cultivation : ఉత్తర తెలంగాణలో అధికంగా సోయాబీన్ సాగు- యాజమాన్యం

Soybean Cultivation : తక్కువ సమయం.. తక్కువ శ్రమతో రైతుకు మంచి నికర లాభం అందించే పంటల్లో సోయాచిక్కుడు ఒకటి.  ఇది లెగ్యూమ్ జాతికి చెందిన పప్పుజాతి పంట. అయితే నూనెగింజ పంటగా దీనికి అధిక ప్రాధాన్యత వుంది.

Soybean Cultivation : ఉత్తర తెలంగాణలో అధికంగా సోయాబీన్ సాగు- యాజమాన్యం

Soybean Cultivation Methods For Kharif Season

Soybean Cultivation : ఉత్తర తెలంగాణలో ఖరీఫ్ పంటగా సాగు చేసే ముఖ్యమైన పంట సోయాబీన్.  ఇటీవలి కాలంలో మెదక్ వరంగల్, జిల్లాల రైతులు కూడా సాగుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఖరీఫ్ లో వర్షాధారంగా తక్కువకాలంలో మంచి దిగుబడినిచ్చే పప్పుజాతి పంట సోయాచిక్కుడు .

ఈ పంటసాగు వల్ల భూసారం కూడా పెరిగే అవకాశం వుండటంతో చాలామంది రైతులు సోయా సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే  రకాల ఎంపిక, విత్తే సమయం చాలా ముఖ్యమని తెలియజేస్తున్నారు  ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఎం. రాజేందర్ రెడ్డి.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

తక్కువ సమయం.. తక్కువ శ్రమతో రైతుకు మంచి నికర లాభం అందించే పంటల్లో సోయాచిక్కుడు ఒకటి.  ఇది లెగ్యూమ్ జాతికి చెందిన పప్పుజాతి పంట. అయితే నూనెగింజ పంటగా దీనికి అధిక ప్రాధాన్యత వుంది. నూనెలో కొవ్వుశాతం తక్కువ వుండటం వల్ల ఆరోగ్యానికి  చాలా మంచిది.

నూనె తీసిన సోయా పిండిలో 50 నుండి 60 శాతం మాంసకృతులు వుండటం వల్ల వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో దాణా తయారీకి ప్రధాన ముడిసరుకుగా  వాడుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఈ పంట అత్యధికంగా సాగులో ఉంది. మూడునాలుగేళ్లుగా మెదక్, వరంగ్, కరీంనగర్ లాంటి జిల్లాలకు కూడా విస్తరించింది.

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలను రుతుపనాలు  పలకరించడంతో.. అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో రైతులు పంటల సాగుకు సిద్ధమువుతున్నారు. ముఖ్యంగా సోయాచిక్కుడు సాగుకు  జూన్ 15 నుండి జూలై 15 వరకు అనుకూల సమయం.

కోస్తా జిల్లాల్లో ఆగష్టు సెప్టెంబరు వరకు విత్తుకోవచ్చు. సారవంతమైన నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలంగా వుంటాయి. తెలంగాణలో ఎక్కువ మంది రైతులు వర్షాధారంగా సాగుచేస్తున్నారు .  ప్రస్థుతం సోయాచిక్కుడు విత్తేందుకు అనుకూలం  సమయం. అయితే అధిక దిగుబడులు పొందాలంటే విత్తన ఎంపిక ముఖ్యమని తెలియజేస్తున్నారు  ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఎం. రాజేందర్ రెడ్డి.

Read Also : Rains Alert : తొలకరి కురిసే.. రైతన్న మురిసే.. పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు