Black Gram Cultivation : అధిక దిగుబడులకోసం ఖరీఫ్ మినుములో మేలైన యాజమాన్యం

ప్రస్తుతం 20 నుండి 30 రోజుల దశలో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కలుపు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనిని నివారించి ఎరువులను వేస్తే మంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు శ్రీకాకుళం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త , డా. పి . వెంకట రావు

Black Gram Cultivation : అధిక దిగుబడులకోసం ఖరీఫ్ మినుములో మేలైన యాజమాన్యం

Black Gram Cultivation

Updated On : August 8, 2023 / 11:44 AM IST

Black Gram Cultivation : స్వల్పకాలంలో చేతికొచ్చి, తక్కువ నీరు , శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పుజాతి పంట  మినుము. మూడు కాలాల్లో సాగుచేసుకోవచ్చు.  అంతే కాక అంతర పంటగా కూడా వేసుకొని అధనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఖరీఫ్ లో వేసిన మినుముకు చీడపీడలు సోకే ప్రమాదం ఉంది. సరైన సమయంలో వీటి నివారణ చేపట్టి మేలైన ఎరువుల యాజమాన్యం చేపడితే  అదిక దిగుబడులను పొందవచ్చంటున్నారు   శ్రీకాకుళం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త , డా. పి . వెంకట రావు

READ ALSO : Tambulam : తాంబూలం ఇస్తున్నారా? పద్ధతి పాటించకపోతే దోషం కలుగుతుందట

తెలుగు రాష్ట్రాల్లో మినుమును దాదాపు 7 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు.  ఈ పంటను మూడు కాలల్లో సాగుచేసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో 1 లక్షా 50 వేల ఎకరాలలో సాగవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పన్నెండున్న లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు.

ప్రస్తుతం 20 నుండి 30 రోజుల దశలో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కలుపు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనిని నివారించి ఎరువులను వేస్తే మంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు శ్రీకాకుళం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త , డా. పి . వెంకట రావు

READ ALSO : Chhattisgarh village : పిడుగులు పడకుండా ఆవుపేడ పూత..గ్రామంలో ఇళ్ల గోడలపై వింత డిజైన్లు

ముఖ్యంగా ఖరీఫ్  మినుములో చీడపీడలు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.  ప్రధానంగా పూత దశలో మరుకా మచ్చల పురుగు, తామర పురుగు, కాండం ఈగ  వల్ల తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. వీటిని గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మినుము పంటకు తెగుళ్లు అశనిపాతంలా మారాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించకపోవతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వీటి నివారణకు పలు సూచనలు చేస్తున్నారు శాస్త్రవేత్త డా. పి . వెంకట రావు.