Tomato Cultivation : వివిధ దశల్లో ఖరీఫ్ టమాట సాగు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

Tomato Cultivation : టమాట పంటను  సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు. కానీ అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం ఈ పంట తట్టుకోలేదు. అందువల్ల శీతాకాలంలో సాగుచేసిన పంటనుంచి అధిక దిగుబడి వస్తుంది.

Tomato Cultivation : వివిధ దశల్లో ఖరీఫ్ టమాట సాగు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

Techniques in Tomato Cultivation

Tomato Cultivation : మార్కెట్‌లో టమాటా ఏ సీజన్‌లోనైనా లభిస్తుంది. ఇది నిత్య పంట. మార్కెట్ ను అంచనా వేసి దఫదఫాలుగా నాటుకుంటే.. ధరల ఆటుపోట్ల నష్టాన్ని అధిగమించవచ్చు. అలాగే ఆయాప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకోవడమే కాకుండా.. మేలైన యాజమాన్యం చేపడితేనే అధిక దిగుబడులను సాధించవచ్చు. ఖరీఫ్  టమాట సాగులో పాటించాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

టమాట పంటను  సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు. కానీ అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం ఈ పంట తట్టుకోలేదు. అందువల్ల శీతాకాలంలో సాగుచేసిన పంటనుంచి అధిక దిగుబడి వస్తుంది. సారవంతమైన నేలలు టమాట సాగుకు అనుకూలం. ఆమ్ల, చౌడు భూములు, మురుగునీటి సౌకర్యం లేని భూమలలో ఈ పంటను పండించకూడదు.

ఖరీఫ్ పంటగా ఇప్పటికే విత్తిన రైతులు, శీతాకాలం పంటగా విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు ఈ పంటను దఫదఫాలుగా నాటతారు. అయితే అధిక దిగుబడులను రైతులు పొందాలంటే విత్తనం మొదలు పొలం తయారి తోపాటు పోషకాలు,  ఎరువులు, నీటి యాజమాన్యంతో పాటు చీడపీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చంటూ .. యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి

టమాట సాగులో నీటి యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకం . భూమిలో తేమను బట్టి నీటితడులు అందించాలి. ఎరువులను వాడటం వలన ఉత్పత్తి పెరుగుంతుంది. కాయ కూడా నాణ్యతగా ఉంటుంది. అంతే కాదు టమాటలో కలుపు యాజమాన్యం కూడా కీలకం. ఇటు చీడపీడల పట్ల పలు జాగ్రత్తలు వహించాలి. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.

కాయ నాణ్యతను బట్టే మార్కెట్ లో ధర పలుకుతుంది. కాబట్టి టమాటను సంప్రదాయ బద్ధంగా కాకుండా స్టేకింగ్ విధానంలో సాగుచేయాలి. ఈ విధానంలో కాయ నేలకు తగలవు, దీంతో కాయదెబ్బతినదు. ఇటు బరువు పెరగడంతో పాటు షైనింగ్ వచ్చి మంచి ధర వస్తుంది. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 10 నుండి 15 టన్నుల దిగుబడి వస్తే అదే స్టేకింగ్ విధానంలో  30 నుండి 50 టన్నుల వరకు దిగుబడిని తీసే అవకాశం ఉంది. పైగా పంటకాలం పెరుగుతుంది.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు