Plant Mango : మామిడి నాటేందుకు తొలకరి అనువైన సమయం.. మార్కెట్ గిరాకీకి అనుగుణంగా రకాలు ఎంపిక

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల డిమాండ్ కు అనుగుణంగా అధునాతన గ్రాఫ్టింగ్ పద్ధతులతో ఉత్పత్తయిన అంటు మొక్కలను రైతులకు సరఫరాచేస్తున్నారు. వాణిజ్యసరళిలో మామిడి సాగుకు అనువైన 20 రకాలను ఉత్పత్తిచేస్తున్నారు.

Plant Mango : మామిడి నాటేందుకు తొలకరి అనువైన సమయం.. మార్కెట్ గిరాకీకి అనుగుణంగా రకాలు ఎంపిక

mango Plants

Plant Mango : పండ్లతోటలనుంచి రైతులు పదికాలాలపాటు మంచి ఫలసాయం పొందాలంటే సారవంతమైన నేలల ఎంపికతోపాటు, ఆయా ప్రాంతాల డిమాండ్ కు అనుగుణంగా రకాలను ఎంపికచేసుకోవాలి. నేడు అనేక పండ్ల మొక్కల నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి ప్రలోభాలకు లొంగకుండా రైతులు నమ్మకమైన నర్సరీలను మొక్కలను కొనుగోలుచేయాలి.

READ ALSO : Mango Farming : 40 ఎకరాల్లో మామిడి సాగు.. ఏడాదికి రూ. 50 లక్షల నికర ఆదాయం

ఎందుకంటే పండ్లతోటలను నాటిన 4-5సంవత్సరాల తర్వాతగాని వాటి దిగుబడి సామర్ధ్యాన్ని అంచనావేయలేం. తీరా నాటింది నాశిరకం మొక్కైతే… పడిన శ్రమంతా వృధా అవుతుంది. పెట్టిన పెట్టుబడంతా బూడిదలోపోసిన పన్నీరవుతుంది. అందువల్ల కొత్తగా మామిడి తోటలు సాగు చేసే రైతాంగం భూబౌతిక లక్షణాలు గమనించి నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసుకోవాలంటూ సూచిస్తున్నారు సంగారెడ్డి ఫలపరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా, ఎ. భగవాన్

READ ALSO : Mulching System : మల్చింగ్‌ సాగు.. లాభాలు బాగు

పదికాలాలపాటు దిగుబడినిచ్చే పంట మామిడి. మామిడికి పుట్టినిల్లు మనదేశమే. అత్యంత వైవిధ్యభరిత జన్యు సంపదా మన సొంతం. అయినా ఇతర దేశాలు మనకన్నా 50 శాతం మిన్నగా అధిక దిగుబడులు సాధిస్తున్నాయి. సంప్రదాయ సాగు పద్ధతులు ఇంకా వేళ్లూనుకుని వుండటం, నాణ్యమైన మొక్కలు అందుబాటులో లేకపోవటం దీనికి ప్రధాన కారణాలుగా కన్పిస్తున్నాయి. మామిడి మొక్కదశలో దాని దిగుబడిని అంచనా వేయటం చాలా కష్టం.

READ ALSO : varieties of Warangal Kandi : రైతులకు అందుబాటులో నూతన వరంగల్ కంది రకాలు.. తక్కువ సమయంలోనే అధిక దిగుబడి

అందువల్ల మొక్కల ఎంపికలో సరైన అవగాహనతో మెలగాలి. మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఫల పరిశోధనాస్థానం నాణ్యమైన పండ్ల మొక్కలకు పెట్టింది పేరు. ఏటా లక్షల సంఖ్యలో మామిడి మొక్కల ఉత్పత్తి జరుగుతుందిక్కడ. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల డిమాండ్ కు అనుగుణంగా అధునాతన గ్రాఫ్టింగ్ పద్ధతులతో ఉత్పత్తయిన అంటు మొక్కలను రైతులకు సరఫరాచేస్తున్నారు. వాణిజ్యసరళిలో మామిడి సాగుకు అనువైన 20 రకాలను ఉత్పత్తిచేస్తున్నారు.  ప్రస్థుతం జూన్ నుంచి మామిడి నాటే సమయం కనుక కొత్తగా తోటలు వేయబోయే రైతాంగం మామిడి అంటు మొక్కల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు సంగారెడ్డి ఫలపరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా, ఎ. భగవాన్

READ ALSO : Mahua Flower : గిరిజనులకు కల్పతరువుగా ఇప్పపువ్వు.. ఉప ఉత్పత్తులతో ఉపాధి పొందుతున్న మహిళలు

మామిడి మొక్కల్లో అంటుకట్టిన తల్లికాడ మంచిదైతే కొత్త అంట్లు నాణ్యమైన అధిక దిగుబడినిస్తాయి. అధిక దిగుబడినిచ్చే తల్లి చెట్టు నుంచి సేకరించే కొమ్మను…. సయాను అంటారు. వీటిని వెనీర్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో మొక్కలకు అంటుకడతారు. మొక్కలను కొనుగోలుచేసేటప్పుడు వేరుమూలం, సయాను బాగా అతికివున్న మొక్కలను ఎన్నికచేసుకోవాలి. వేరు మూలంపై కొత్త చిగుర్లు లేని మొక్కలను నాటేందుకు ఉపయోగించాలి. ప్రస్థుతం మార్కెట్లో  వేల సంఖ్యలో మొక్కలను సరఫరాచేసే నర్సరీలు వున్నాయి. గుర్తింపు వున్న నర్సరీల నుంచే మొక్కలను కొనుగోలు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.