విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 10మంది మృతి.. NDRF, NDMA సంయుక్త ప్రకటన  

  • Published By: srihari ,Published On : May 7, 2020 / 12:35 PM IST
విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 10మంది మృతి.. NDRF, NDMA సంయుక్త ప్రకటన  

Updated On : May 7, 2020 / 12:35 PM IST

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఎన్ డీఆర్ఎఫ్, ఎన్ డీఎంఏ సంయుక్త ప్రకటన చేశాయి. గ్యాస్ లీక్ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. వెయ్యి మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్ల వెల్లడించారు. ఎన్ డీఆర్ ఎఫ్, ఎన్ డీఎమ్ ఏ ప్రత్యేక బృందాలను ప్రధాని మోడీ ఏర్పాటు చేశారు. ఉదయం 5.45 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందిందని ప్రధాన్ తెలిపారు.

సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్పాట్ కు వెళ్లాయని పేర్కొన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు తమ బృందాలు అక్కడే ఉంటాయన్నారు. పుణె నుంచి విశాఖకు ప్రత్యేక బృందాలను తరలిస్తున్నామని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చిందన్నారు. స్టైరిన్ ప్రభావాన్ని తగ్గించే ప్రత్యేక మందులేవీ లేవని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా అన్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటిలేటర్ పై చికిత్స అందించాలని పేర్కొన్నారు. బాధితులు కళ్లు, చేతులతను నీటితో శుభ్రంగా కడుగుకోవాలని గులేరియా చెప్పారు. 

మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులు కుందన శ్రేయ 6, ఎన్ గ్రీష్మ (9), చంద్రమౌళి(19), గంగాధర్, నారాయణమ్మ, నరసమ్మ, గంగరాజు, కృష్ణమూర్తి, చంద్రమౌళి, అస్వస్థతకు గురైన 316 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పలువురికి వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొన్ని జంతువులు కూడా మృత్యువాతపడ్డాయి. విష వాయువు ప్రభావానికి చెట్లు మాడిపోయాయి.