ఏపీలో 24 గంటల్లో 48 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 వేల 205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనాతో 49 మంది మృతి చెందారు. 1353 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 803 మందికి చికిత్స కొనసాగుతుంది.
ఇవాళ నమోదైన కేసుల్లో గుంటూరు 9, నెల్లూరు 9, కర్నూలు 9 చిత్తూరు 8, కృష్ణా 7, విశాఖ, 4, కడప1, పశ్చిమగోదావరి 1 కేసు నమోదు అయింది. కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కర్నూలు ఇప్పటివరకు 608 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో 413, కృష్ణా జిల్లాలో 367 మంది కరోనా బారిన పడ్డారు.
ఏపీలోని కొన్ని జిల్లాలో దాదాపుగా కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు ఐదు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిగతా జిల్లాల్లో కోయంబేడు నుంచి వచ్చినటువంటి వారికి టెస్టులు చేయగా వారికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్ని జిల్లాలో 9, 8,7 కేసుల చొప్పున నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదైతే దాంట్లో దాదాపు 31 కేసులు కోయంబేడు నుంచి వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా పాజిటివ్ కేసులుగా తేలింది. కేవలం 17 కేసులు మాత్రమే ఏపీలో ఉండి ఇక్కడున్నవంటి వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చినట్ల నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో గడిచిన 24 గంటల్లో కరోనా ఒకరు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 49కి చేరింది.
ఇప్పటివరకు 9628 శాంపిల్స్ తీస్తే దాంట్లో కేవలం 48 మందికి మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి. గత 15 రోజులుగా క్రమేపి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. కోయంబేడు నుంచి వచ్చిన వారి సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో వారికి మాత్రమే పాజిటివ్ కేసులు సంఖ్య ఆ విధంగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో 803 మంది చికిత్స పొందుతున్నారు.
గడిచిన 24 గంటల్లో 101 మంది పూర్తి స్థాయిలో చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వెళ్లారు. 1353 మంది పూర్తిస్థాయిలో కోలుకుని ఇంటికి వెళ్లారు. కేవలం నాలుగు జిల్లాల్లో మాత్మే కేసులు పెరుగుతున్నాయి. దాదాపు ఐదు జిల్లాల్లో ఒక కేసు కూడా మనోదు కాకపోవడం కొంత ఆశాజనకమైన పరిణామం. ఆయా ప్రాంతాల్లో పఠిష్టమైన చర్యలు, లాక్ డౌన్ అమలు, రెడ్ జోన్ల ఏరియాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయడమే దీనికి కారణమని భావిస్తున్నారు.
Read Here>> ఏపీలో కరోనా @ 2,205 : కర్నూలులో 608, గుంటూరులో 413