Child Died : రేగు పండ్లు తిని చిన్నారి మృతి

గమనించిన స్థానికులు అస్వస్థకు గురైన వీరిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో హర్ష(2) అనే చిన్నారి మృతి చెందింది.

Child Died : రేగు పండ్లు తిని చిన్నారి మృతి

Plum Fruits

Updated On : June 11, 2022 / 5:57 PM IST

child died : ఆంధ్రప్రదేశ్ లో విషాదం నెలకొంది. రేగుపండ్లు తిని చిన్నారి మృతి చెందింది. కర్నూలు జిల్లాలోని కోసిగి గ్రామంలో చెట్టుపై పండిన రేగిపండ్లను తెంపి మహిళతో పాటు ముగ్గురు చిన్నారులు వాటిని తిన్నారు. అయితే రేగుపండ్లను తిన్న కొద్దిసేపటికే నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

గమనించిన స్థానికులు అస్వస్థకు గురైన వీరిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో హర్ష(2) అనే చిన్నారి మృతి చెందింది.

Coconut Piece: మూడేళ్ల చిన్నారి గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని..

అస్వస్థతకు గురైన మహాదేవి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన చిన్నారులు అంజి, శ్రీరాములు ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు.