Jammu and Kashmir : యాత్రికులను వదిలేసి పరారైన ట్రావెల్ ఏజెన్సీ..జమ్ముకశ్మీర్‌లోని హోటల్‌లో చిక్కుకున్న సిక్కోలు వాసులు

సింధూ పుష్కరాలకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసులు లద్దాఖ్‌లో ఇరుక్కుపోయారు. యాత్రికులును వదిలేసి ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు పరారయ్యారు.

Jammu and Kashmir : యాత్రికులను వదిలేసి పరారైన ట్రావెల్ ఏజెన్సీ..జమ్ముకశ్మీర్‌లోని హోటల్‌లో చిక్కుకున్న సిక్కోలు వాసులు

Srikakulam Residents

Updated On : November 24, 2021 / 12:02 PM IST

Srikakulam district residents : సింధూ పుష్కరాలకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసులు లద్దాఖ్‌లో ఇరుక్కుపోయారు. యాత్రికులును వదిలేసి ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు పరారయ్యారు. ఇక డబ్బులు కట్టాలని 120 మందిని హోటల్ సిబ్బంది నిర్బంధించారు. కపుల్‌ టూరిజం పేరుతో యాత్రకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసులు.. అలా ట్రావెల్ ఏజెన్సీ చేతిలో మోసపోయారు. మైసూరు టూరిజం ప్యాకేజీతో బాధితులు యాత్రకు వెళ్లారు.

జమ్ముకశ్మీర్‌లోని కట్రా వద్ద హోటల్‌లో యాత్రికులు చిక్కుకున్నారు. హోటల్ సిబ్బంది నిర్బంధించడంతో దిక్కుతోచని స్థితిలో బాధితులు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో తెలియక యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. తమను ఆదుకోవాలంటూ పాలకొండ, నరసన్నపేట వాసుల వేడుకుంటున్నారు.