# Agnipath : సికింద్రాబాద్ ఘటనతో వాల్తేరు రైల్వే డివిజన్ అప్రమత్తం..భద్రత కట్టుదిట్టం..

సికింద్రాబాద్ ఘటనతో వాల్తేరు రైల్వే డివిజన్ అప్రమత్తమైంది..భద్రత కట్టుదిట్టం చేసింది.

# Agnipath : సికింద్రాబాద్ ఘటనతో వాల్తేరు రైల్వే డివిజన్ అప్రమత్తం..భద్రత కట్టుదిట్టం..

Agnipath Waltair Railway Division Alerted Due To Protests In Secunderabad Railway Station

Updated On : June 17, 2022 / 3:04 PM IST

Agnipath : ఆర్మీ రిక్రూట్ మెంట్‌లో భాగంగా కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసలు హోరెత్తుతున్నాయి. నిన్నటి వరకు ఉత్తరభారతానికి మాత్రమే పరిమితం అయిన ఈ ఆందోళనలు తెలంగాణకు కూడా పాకాయి. నిరసనలు కారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పెను విధ్వంసం సృష్టించారు.రైల్వే ఆస్తులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లను ఉపయోగించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ రక్తసిక్తమైంది. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరికొందరు యువకులు గాయపడ్డారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను మూసేశారు. ప్రయాణికులెవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ ఘటనలో నాంపల్లి రైల్వే స్టేషన్ ను మూసివేశారు. అలాగే ఎంఎంటీఎస్ రైళ్లను..మెట్రో రైళ్లను కూడా నిలిపివేశారు.ఈ ఘటనలతో వాల్తేరు రైల్వే డివిజన్ కూడా అప్రమత్తమైంది.వాల్తేరు రైల్వే డివిజన్ లోని విశాఖ సహా పలు స్టేషన్ లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాల్తేరు డివిజన్ లోని పరిస్థితిపై డీఆర్ఎం అనూప్ కుమార్ సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Read Also: అగ్నిపథ్​ పథకంలో కీలక మార్పు.. వయో పరిమితిని పెంచిన కేంద్రం

పక్కా ప్లాన్ తోనే..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన పక్కా ప్లాన్ తో నిర్వహించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని.. దాని ద్వారానే కమ్యూనికేట్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా ఆర్మీ అభ్యర్థులకు సమాచారం.శుక్రవారం (జూన్ 17,2022)ఆందోళన చేపట్టాలని ముందస్తుగా నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తమ సమస్యలు తీసుకురావాలని అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంచుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆందోళనలు అదుపుచేసేందుకు ఫైరింగ్ చేయగా.. ఒకరి పరిస్థితి విషమం కాగా, మరొకరు మృతి చెందారు. వందలాది అభ్యర్థులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ఆందోళన పరిస్థితిపై రైల్వే డీజీ సందీప్ శాండిల్య ఆరా తీశారు. ఆందోళనను కట్టడి చేయడంతో పాటు రైళ్ల పునరుద్ధరణ కోసం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు భారీగా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ రక్తసిక్తమైంది. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరికొందరు యువకులు గాయపడ్డారు.

Read Also:  Nampally Railway Station : సికింద్రాబాద్ లో విధ్వంసం..నాంపల్లి రైల్వేస్టేషన్ మూసివేత

శుక్రవారం ఉదయం భారీ ఎత్తున రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు దహనమయ్యాయి. రైల్వే స్టేషన్‌కు చెందిన పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.