మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన అధికారులు

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన అధికారులు

Agriculture Officers Shocks Minister Somireddy Chandramohan Reddy

Updated On : June 23, 2021 / 1:14 PM IST

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వ్యవసాయ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఉదయం 11.30 గంటలకు వ్యవసాయ శాఖపై మంత్రి సమీక్ష పెట్టారు. హాజరు కావాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శికి, ప్రత్యేక కమిషనర్ కు సమాచారం ఇచ్చారు. కానీ వారు ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు. సమీక్షపై ఈసీని అధికారులు స్పష్టత కోరారు.

అధికారుల కోసం ఉదయం నుంచి సచివాలయంలో సోమిరెడ్డి వేచి చూశారు. ఎంతకూ అధికారులు రాకపోవడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. ఈసీ సమీక్షను అడ్డుకుంటే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని, సుప్రీంకోర్టుకు వెళ్తానని గతంలో సోమిరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. సమీక్ష జరుగక పోవడంతో సోమిరెడ్డి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.