Inter Classes : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 16 నుంచి క్లాసులు

కరోనా కారణంగా ఏపీలో మూతపడ్డ విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు భావిస్తున్న ప్రభుత్వం, విద్యాసంస్థల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో, రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి

Inter Classes : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 16 నుంచి క్లాసులు

Inter Classes

Updated On : August 9, 2021 / 7:06 PM IST

Inter Classes : కరోనా కారణంగా ఏపీలో మూతపడ్డ విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు భావిస్తున్న ప్రభుత్వం, విద్యాసంస్థల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో, రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి జూనియర్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నారు.

కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు బోధించాలని కాలేజీల యాజమాన్యాలకు, ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం ఇటీవలే అందర్నీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. వారిని సెకండియర్ కు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. అటు, ఈ నెల 16 నుంచి స్కూళ్లు కూడా తిరిగి ప్రారంభం కానున్నాయి.

బడులను తెరవాల్సిందే.. ఇంకా మూసి ఉంచితే మరింత ప్రమాదం:
క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో స్కూళ్లు, కాలేజీలు మూత‌బ‌డి ఏడాదిపైనే అయింది. ఆన్ లైన్ బోధన జరుగుతున్నా చాలామంది చిన్నారులు, విద్యార్థులకు అవి బుర్రకెక్కడం లేదు. దానికి తోడు పరీక్షల్లేకుండానే టెన్త్, ఇంటర్ విద్యార్థులను బోర్డులు పాస్ చేసేశాయి. అయితే ఇంత‌కాలంగా ఇలా స్కూళ్లు మూత‌ప‌డ‌టం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ఇది విస్మ‌రించ‌లేని తీవ్ర‌మైన విష‌య‌మ‌ని పార్ల‌మెంట‌రీ ప్యానెల్ స్ప‌ష్టం చేసింది. స్కూళ్లు మ‌ళ్లీ తెర‌వ‌డం అనేది విద్యార్థుల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌కరంగా ఉంటుంద‌ని ఆ ప్యానెల్ అభిప్రాయ‌ప‌డింది. భౌతిక తరగతులను నిర్వహించకుండా బడులను ఇంకా మూసి ఉంచితేనే మరింత ప్రమాదమని అభిప్రాయపడింది. వినయ్ పి. సహస్రబుద్ధ నేతృత్వంలోని పానెల్.. దానికి సంబంధించిన నివేదికను పార్లమెంట్ కు సమర్పించింది.

ఇంత‌కాలంగా స్కూళ్లు మూత‌ప‌డ‌టం కుటుంబాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపింద‌ని, చాలా మంది పిల్ల‌లు బాల కార్మికులుగా మారుతున్నార‌ని ఈ ప్యానెల్ వెల్ల‌డించింది. ఇన్నాళ్లుగా స్కూళ్లు మూత‌ప‌డ‌టం వ‌ల్ల అది పిల్ల‌ల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ఈ ప్ర‌మాదాన్ని విస్మ‌రించ‌కూడ‌దు. చిన్న పిల్ల‌లు స్కూళ్ల‌కు వెళ్ల‌కుండా నాలుగు గోడ‌ల‌కే ప‌రిమితం కావ‌డం వ‌ల్ల త‌ల్లిదండ్రుల‌తో పిల్ల‌ల సంబంధాల‌పై కూడా ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతున్న‌ట్లు ఈ ప్యానెల్ త‌న రిపోర్ట్‌లో తెలిపింది. అంతేకాదు దీని కార‌ణంగా బాల్య వివాహాలు, బాల‌కార్మికుల మ‌ళ్లీ పెరిగిపోతున్న‌ట్లు అందులో స్ప‌ష్టం చేసింది. వీటిని దృష్టిలో ఉంచుకొని వెంట‌నే స్కూళ్లు తెర‌వ‌డం అనేది చాలా ముఖ్య‌మ‌ని త‌న నివేదిక‌లో ప్యానెల్ సిఫార‌సు చేసింది.