Polavaram Project : ముహూర్తం ఫిక్స్.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలక పరిణామం
సీఈ నరసింహమూర్తి పర్యవేక్షణలో సాగనున్న ఈ నిర్మాణ పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.

Polavaram Project
Polavaram Project : ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలవరంలో ప్రధానంగా ఉన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. శనివారం ఉదయం 10గంటల 23నిమిషాలకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తయ్యేలా ప్లాన్..
టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డి-వాల్ ను నిర్మిస్తున్నాయి భావర్ అండ్ మేఘా ఇంజినీరింగ్, ఎల్ అండ్ టీ కంపెనీలు. సీఈ నరసింహమూర్తి పర్యవేక్షణలో సాగనున్న ఈ నిర్మాణ పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. డి వాల్ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నా ఇంజినీరింగ్ అధికారులు.
Also Read : నవ్యాంధ్రలో కూటమి ఫ్యూచర్‌కు తిరుగులేదా? బాబు, పవన్ మాటల్లో లాంగ్ టర్మ్ వ్యూహం ఉందా?
నిర్మాణ పనులు అధికారులే ప్రారంభించాలని నిర్ణయం..!
ఏపీకి జీవనాడి, బహుళార్ధసాధక ప్రాజెక్ట్ పోలవరంలో కీలక ఘట్టమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అధికారులు ముహూర్తం ఫిక్స్ చేశారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పనులను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను అధికారులే ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి శనివారం ఉదయం 10గంటల 23 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

Polavaram Project
సీఈ నరసింహమూర్తి పర్యవేక్షణలో డి వాల్ నిర్మాణ పనులు..
పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి సీఈగా ఉన్న నరసింహమూర్తి పర్యవేక్షణలో పనులు జరుగుతాయి. ఈ ఏడాది చివరి నాటికి డి వాల్ నిర్మాణానికి సంబంధించిన మొత్తం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష జరిపారు. ఈ ఏడాది చివరి నాటికల్లా డి వాల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ మేరకే లక్ష్యంగా పెట్టుకుని పనులను ప్రారంభిస్తున్నారు అధికారులు.
మొత్తానికి డి వాల్ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. భావర్, మేఘా ఇంజినీరింగ్ కంపెనీ, ఎల్ అండ్ టీ కంపెనీ ఇంజినీర్లు ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ.. డి వాల్ నిర్మాణ పనుల అంశం చర్చకు వచ్చింది. నిర్మాణ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఈ సీజన్ లోనే పనులు పూర్తి చేయాలని లక్ష్యం..
ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం డి వాల్ నిర్మాణం రెండు సీజన్లకు పూర్తవుతుందని అంచనా వేశారు. కానీ, టెక్నాలజీని ఉపయోగించుకుని, అలాగే విదేశీ నిపుణుల బృందం సలహాలు, సూచనల మేరకు ఈ సీజన్ లోనే దాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రేపు ఒక వేళ వరదలు వచ్చినా.. ఇబ్బంది లేకుండా ఉండేలా డి వాల్ నిర్మాణాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read : వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు.. చాలా శాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది?