3 రాజధానుల బిల్లు : సీఎం జగన్ చెప్పిన ఆంధ్రుల రాజధాని చరిత్ర

  • Published By: madhu ,Published On : January 20, 2020 / 03:45 PM IST
3 రాజధానుల బిల్లు : సీఎం జగన్ చెప్పిన ఆంధ్రుల రాజధాని చరిత్ర

Updated On : January 20, 2020 / 3:45 PM IST

3 రాజుధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సుదీర్ఘంగా..మాట్లాడుతుండడంపై అధికారపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. దాదాపు గంట సేపు మాట్లాడరని, ముఖ్యమంత్రి జగన్‌ను మాట్లాడనీయకుండా టీడీపీ కుట్రలు పన్నుతోందని సీఎం జగన్ తెలిపారు. మాట్లాడేందుకు జగన్ ప్రయత్నించారు. కానీ..టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా గత చరిత్రను గుర్తు చేశారు సీఎం జగన్. రాత్రి 9గంటల వరకు సీఎం‌కు మైక్ ఇవ్వకుండా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కానీ ప్రజలు అర్థం చేసుకుంటారని తెలిపారు. 
 

‘1953, అక్టోబర్ 01వ తేదీన కర్నూలు రాజధానిగా అవతరించింది. 2014, జూన్‌లో 13 జిల్లాల ఏపీగా అవతరించింది. తర్వాత జరిగిన పరిణామాలను గమనించాలి. ఇందులో చారిత్రక తప్పిదాలు, అనేక అన్యాయాలు జరిగాయి. 1953లో రాష్ట్రంగా అవతరిస్తూ..మద్రాసును పొగోట్టుకున్నాం..కర్నూలు రాజధానిని త్యాగం చేశాం. 2014లో హైదరాబాద్‌‌ను పొగొట్టుకున్నాం. ఒక అభివృద్ధి కేంద్రంగా ఉన్న నగరాలను ఆరు దశబ్దాలుగా వదులుకున్న రాష్ట్రం ఏపీ. ఓటు కోసం నోట్లు ఇస్తూ..ఒక మనిషి చేసిన తప్పిదాలు జరిగాయి. 1997లో శ్రీ బాగ్ ఒప్పందం జరిగింది.

1937లో మద్రాసు రాష్ట్రం కలిసి ఉండగా..కొత్త రాష్ట్రం ఏర్పాటు కావాలని ఆరాటపడ్డాం. హైకోర్టు, కేపిటల్ ఒకే ప్రాంతంలో ఉండడం కరెక్టు కాదు. ప్రతి ప్రాంతానికి ఒకటి చొప్పున డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఒడంబడికలో రాయడం జరిగింది. 1953 నుంచి 1956 వరకు కర్నూలు రాజధానిగా ఉంది. 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు..జస్టిస్ శ్రీ కృష్ణన్ కమిటీ అనేక అంశాలను అధ్యయనం చేసింది. మనిషికి కావాల్సిన అవసరాలు..ఏ జిల్లాల్లో ఎలా ఉన్నాయనే దానిపై స్టడీ చేసింది.

అభివృద్ధి రాహిత్యం వల్ల తెలంగాణ వస్తే..రెండోసారి అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల విడిపోయేందుకు వచ్చిందని కమిటీ చెప్పింది. ఆ తర్వాత శివరామకృష్ణన్ కమిటీ వచ్చింది. విడిపోయిన తర్వాత..ఏపీ అభివృద్ధి అంతా..ఒక్క ప్రాంతానికి కల్పించడం సరికాదు.’ అంటూ గతంలో జరిగిన వాటిని సీఎం జగన్ సుదీర్ఘంగా వినిపించారు. 

Read More : 3 రాజధానుల బిల్లు : TDP సభ్యుల సస్పెన్షన్