Maha Padayatra : అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. ఉదయం 9 గంటల 5 నిమిషాలకు మహాపాదయాత్రను ప్రారంభించారు.

Maha Padayatra
Farmers’ maha Padayatra : ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు మహాపాదయాత్ర ప్రారంభించారు. ఉదయం 9 గంటల 5 నిమిషాలకు మహాపాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తుళ్లూరు రైతు దీక్ష శిబిరంలోని కాలభైరవ, లక్ష్మీ గణపతి ఆలయాల్లో పూజలు చేశారు. యాత్రలో భాగంగా రైతులు ఏడు కిలోమీటర్ల దూరంలోని పెదపరిమికి చేరుకొని భోజనం చేయనున్నారు. ఇక అక్కడ నుంచి మరో ఏడు కిలోమీటర్లు నడిచి తాడికొండలో రాత్రికి బస చేస్తారు. ఈ మహా పాదయాత్ర నవంబర్ 17 వరకు జరగనుంది.
మహాపాదయాత్రకు పోలీసులు ఆంక్షలతో అనుమతించారు. ఈ పాదయాత్రను ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకే నిర్వహించాలని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, ప్రసంగాలు, స్వాగతాలను నిషేధించారు. 157 మందికి ఒక్కరు కూడా మించకుండా పాదయాత్ర చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాదయాత్రలో పాల్గొన్న వారు కచ్చితంగా ఐడి కార్డులు ధరించాలని సూచించారు.
Andhra Pradesh : వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు.. సీఎం జగన్ చేతుల మీదుగా ప్రదానం
ఏకైక రాజధాని డిమాండ్‌ను వ్యతిరేకించే వర్గాలతో పాదయాత్రికులు ఎక్కడా ఘర్షణలకు దిగకుండా నిర్వాహకులు బాధ్యత వహించాలన్నారు పోలీసులు. రైతుల పాదయాత్రకు ఆయా జిల్లాలలో పోలీసులు రక్షణ కల్పించాలని బందోబస్తు ఏర్పాట్లు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అమరావతి రైతులు తిరుమల వరకు ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు.