Amaravati Farmers : తిరుమలలో బహిరంగసభకు అమరావతి రైతులు రెడీ

నాలుగు జిల్లాల మీదుగా 5 వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అయితే తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి పాదయాత్రను రైతులు ముగించనున్నారు.

Amaravati Farmers : తిరుమలలో బహిరంగసభకు అమరావతి రైతులు రెడీ

Updated On : December 16, 2021 / 8:17 AM IST

Amaravati Farmers Tirupati : తిరుమలలో.. భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు అమరావతి రైతులు. అమరావతి రైతుల బహిరంగ సభకు ఏపీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో.. ఏర్పాట్లు చేస్తున్నారు. 2021, డిసెంబర్ 17వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సభ నిర్వహించుకోవచ్చంటూ.. షరతులతో అనుమతులు ఇచ్చింది హైకోర్టు. కోవిడ్‌ రూల్స్‌ పాటించాలని.. సూచించింది. ఇక.. తమ బహిరంగ సభకు అదేరోజు అనుమతి ఇవ్వాలన్న రాయలసీమ హక్కుల సాధన సమితి వేసిన పిటిషన్‌పై విచారించింది హైకోర్టు. ఒకేరోజు రెండు సభలకు అనుమతి ఇచ్చేది లేదని.. మరోరోజు సభను నిర్వహించుకోవాలని సూచించింది.

Read More : Prakasam : బస్సులో ఎగ్జిట్ డోర్ ఎక్కడుందో డ్రైవర్‌‌కే తెలియదు

అమరావతి సాధన కోసం.. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేస్తున్న రైతులు.. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని కోరుతూ రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 1న తుళ్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. కోర్టు అనుమతితో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు.

Read More : Madhya Pradesh : వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవాలి..లేకపోతే..ఉరి తీస్తా

నాలుగు జిల్లాల మీదుగా 5 వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అయితే తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి పాదయాత్రను రైతులు ముగించనున్నారు. నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. ఇక.. అమరావతి రైతులకు మద్ధతుగా నిలవనుంది టీడీపీ. రెండ్రోజుల పాటు అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా సంఘీభావ ర్యాలీలు నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ ర్యాలీలు నిర్వహించనున్నారు టీడీపీ నేతలు.