Prakasam : బస్సులో ఎగ్జిట్ డోర్ ఎక్కడుందో డ్రైవర్‌కే తెలియదు
బస్సులో మంటలు ఆర్పే పరికరాలు లేవన్నారు ప్రయాణీకులు. ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడం కలకలం రేపింది.

Bus
Private Travels Bus Accident : బస్సులో ఎగ్జిట్ డోర్ ఎక్కడుందో డ్రైవర్ కు తెలియదు…మంటలు ఆర్పే పరికరాలు లేవన్నారు ప్రయాణీకులు. ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. బుధవారం…జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరు వాగులో బస్సు పడటంతో డ్రైవర్ సహా పది మంది మరణించిన సంగతి తెలిసిందే. మరో ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. కానీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించక లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై బస్సులో ఉన్న ప్రయాణీకులు స్పందించారు. బస్సులో కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నామన్నారు.
Read More : Covid Third Wave: కరోనా మూడో వేవ్ కచ్చితంగా వస్తుంది.. నిపుణుల హెచ్చరిక!
డ్రైవర్, అటెండెంట్ లకు కనీసం ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్ తెలియదని, కళ్ళముందే లగేజ్ కాలిపోతున్నా ఆర్పేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. అందులో విలువైన వస్తువులు, నగదు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2021, డిసెంబర్ 15వ తేదీ రాత్రి ఓ ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుండి చీరాలకు వస్తోంది. తిమ్మరాజుపాలెం వద్దకు రాగానే…షార్టు సర్క్యూట్ తో బస్సులో మంటలు చెలరేగాయి.
Read More : PRC Employees: ఉద్యోగుల పీఆర్సీపై మరోసారి చర్చలు
విషయం తెలుసుకున్న డ్రైవర్..ప్రయాణీకులను అలర్ట్ చేశారు. వెంటనే బస్సులో నుంచి దూకేశారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ప్రయాణీకుల లగేజీ పూర్తిగా దగ్ధమైంది. బస్సులో 8 మంది ప్రయాణికులు, ముగ్గురు బస్సు సిబ్బంది ఉన్నారు.