Covid Third Wave: కరోనా మూడో వేవ్ కచ్చితంగా వస్తుంది.. నిపుణుల హెచ్చరిక!

కరోనా మహమ్మారిపై ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు దేశంలోని ప్రముఖ ఆరోగ్య నిపుణుడు ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్.

Covid Third Wave: కరోనా మూడో వేవ్ కచ్చితంగా వస్తుంది.. నిపుణుల హెచ్చరిక!

Omicron Cases In Country

Covid Third Wave: కరోనా మహమ్మారిపై ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు దేశంలోని ప్రముఖ ఆరోగ్య నిపుణుడు ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్. కరోనా మూడో వేవ్ ఖచ్చితంగా వస్తుందని తీవ్రమైన వ్యాధులు, బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడుతున్న వారికి బూస్టర్ డోసు కచ్చితంగా ఇవ్వాలని, ఇందుకోసం వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించాలని అభిప్రాయపడ్డారు అశోక్ సేథ్.

కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతుండగా.. వైరస్ ఇతర వైవిధ్యాలతో పోలిస్తే ఇది భయంకరమైన వేరియంట్‌గా చెబుతున్నారు. ‘మూడో వేవ్ రావడం అనివార్యం అని, ముఖ్యంగా తీవ్రమైన వ్యాధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు.. ఆరోగ్య కార్యకర్తలు భద్రత కోసం బూస్టర్ డోస్ వేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

దేశంలో పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులను చూస్తుంటే, మనం ప్రమాదంలో ఉన్నామని స్పష్టంగా అర్థం అవుతోందని, ఎదుర్కోవడానికి ఆరోగ్యరంగం సిద్ధం కావాలని అన్నారు. ఈ వేరియంట్ చాలా ప్రమాదమని, వేగంగా ఒకరి నుంచి వేరొకరికి సోకుతుందని చెప్పారు. రోగనిరోధక శక్తిని కూడా ఒమిక్రాన్ దెబ్బతీస్తుందని తెలిపారు.

ఓమిక్రాన్ విషయంలో ఇంగ్లాండ్‌ను ఉదాహరణగా తీసుకుంటే, అక్కడ వ్యాక్సిన్ వేయించుకోని, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చిందని చెప్పారు. అయితే, ఈ వేరియంట్ ఆక్సిజన్ అవసరమయ్యే అత్యవసర పరిస్థితిని సృష్టించదని, ఆరోగ్యంగా ఉన్నవారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

బూస్టర్ డోస్‌తో ప్రొటక్షన్:
బూస్టర్ డోస్‌ ఇచ్చేందుకు ఇది సరైన సమయం అని, అయితే బూస్టర్ డోస్ ఎవరికి ఇవ్వాలి అనేది ముఖ్యమైన అంశం అని అన్నారు. కొత్త వేరియంట్‌ విస్తరిస్తున్న సమయంలో బూస్టర్ డోస్ ప్రొటెక్షన్ ఇస్తుందని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.