Ambati Rambabu : ఆ అపవాదు చెరుపుకోండి అంటూ బాలకృష్ణకు అంబటి సూచనలు

మీ బావ కళ్లల్లో ఆనందం కోసం కాదు పార్టీ కోసం పనిచేయండీ..మీ నాన్నగారి పార్టీని చేతుల్లోకి తీసుకుని సారధ్యం వహించండీ అంటూ సూచించారు.

Ambati Rambabu : ఆ అపవాదు చెరుపుకోండి అంటూ బాలకృష్ణకు అంబటి సూచనలు

ambati rambabu balakrishna

ambati rambabu balakrishna : ఆంధ్రప్రదేశ్ లోని రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా గందరగోళంగా మారాయి. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి వారసులకు సూచనలు చేశారు. ఎన్టీఆర్ కుమారులకు..మరీ ముఖ్యంగా బాలకృష్ణకు సూచనలు చేస్తు మీ మీద ఉన్న మచ్చను చెరుపుకోండి..అంటూ వ్యాఖ్యానించారు. పార్టీకి ఎన్టీఆర్ కుమారులు ద్రోహం చేసారనే అపవాదును తుడుచుకోవటానికి మీకు ఒక చక్కని అవకాశం వచ్చింది వినియోగించుకోండి అంటూ సూచించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన జైల్లో ఉన్న క్రమంలో పార్టీని చేతుల్లోకి తీసుకుని సారధ్యం వహించండీ అంటూ బాలకృష్ణకు సూచించారు అంబటి.

మీ బావ కళ్లల్లో ఆనందం కోసం కాదు పార్టీ కోసం పనిచేయండీ..మీ నాన్నగారి పార్టీని చేతుల్లోకి తీసుకుని సారధ్యం వహించండీ అంటూ సూచించారు. చంద్రబాబు అరెస్ట్ పై ప్రభుత్వం చర్చించడానికి సిద్దంగా వుందని వ్యాఖ్యానించిన మంత్రి అంబటి ప్రాపర్ ఫార్మెట్ లో‌వస్తే అసెంబ్లీ లో చర్చించడానికి సిద్దంగా వున్నామని వెల్లడించారు. అదే సమయంలో అసెంబ్లీ వేదికగా మాట్లాడటానికి చాలా అంశాలనున్నాయని అంటూనే బాలకృష్ణ గతంలో ఎప్పుడు ఇంత యాక్టివ్ గా లేరు..బాల చంద్రబాబు అరెస్ట్ అయ్యాక యాక్టివ్ అయ్యారు అని అన్నారు. ఆ యాక్టివ్ ను పార్టిని నడిపించటంలో చూపిండంటీ అంటూనే మీసాలు మెలేయటం అనేది ఆ విషయంలో చూపించండీ అంటూ సెటైర్లు వేశారు.

Chandrababu Custody : నేడే తీర్పు..‍! చంద్రబాబు కస్టడీ పిటిషన్, ఏసీబీ కోర్టు తుది నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

మీసం తిప్పటం బావ కళ్ళలో‌ ఆనందం కోసం కాకుండా మీ పార్టీలో తిప్పండి.. అసెంబ్లీలో కాదు అంటూ ఎద్దేవా చేశారు. ‘‘మీ తండ్రి వెన్నులో కత్తి దిగిన సంగతి గుర్తు తెచ్చుకో బాలకృష్ణా..అంటూ సూచించారు. బాలక్రిష్ణకి ఇది మంచి అవకాశం ఎన్టీఆర్ కుమారులు తండ్రికి ద్రోహం చేశారని అపవాదు వుంది ..పార్టీ పగ్గాలు తీసుకోండి మీ ప్రతాపం చూపండి మీ మీద పడిన మచ్చను తొలగించుకోండీ..మీ రెండు సార్లు గెలిచారు. మీ కుటుంబానికి జరిగిన అన్యాయం గుర్తు తెచ్చుకోండి మీకు నాయకత్వ లక్షణాలు వున్నాయి. మీకు చిత్తశుద్ది వుంటే రండి చర్చలో పాల్గొనండి. మీ ఆర్గుమెంట్లు శాసనసభ లో చెప్పుకోండి ’’అంటూ వ్యాఖ్యానించారు. శాసనసభలో నియమనిబందనలతో పాటించకపోతే తప్పు చేస్తే యాక్షన్ వుంటుంది టిడిపి సబ్యులు రాంగాలనే గందరగోళం చేస్తున్నారు ఇది సరికాదు అంటూ వ్యాఖ్యానించారు.

Arunkumar Vundavalli : బాంబు పేల్చిన ఉండవల్లి.. చంద్రబాబు కేసుని సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్